Vinay Kola
Jio: జియో మరో టెక్నాలజీని ప్రవేశపెట్టింది. స్మార్ట్ టీవీలను కంప్యూటర్లుగా మార్చే సూపర్ టెక్నాలజీని తీసుకొచ్చింది.
Jio: జియో మరో టెక్నాలజీని ప్రవేశపెట్టింది. స్మార్ట్ టీవీలను కంప్యూటర్లుగా మార్చే సూపర్ టెక్నాలజీని తీసుకొచ్చింది.
Vinay Kola
ఫేమస్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన సర్వీస్ లని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే పనిలో పడింది. అందుకోసం చాలా స్పీడ్ గా ముందుకు దూసుకుపోతుంది. టెక్నాలజీని తన కస్టమర్లకు వేగంగా దగ్గర చేసేలే ముందడుగులు వేస్తుంది.తాజాగా మరో కొత్త సెన్సేషన్ క్రియేట్ చెయ్యటానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం కంప్యూటర్ అనేది ప్రతీ రంగంలో కూడా నిత్యావసర భాగమైపోయింది. ఎందుకంటే ఎక్కువ స్పీడ్ తో పని చెయ్యడానికి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చెయ్యడానికి, ముఖ్యంగా ఆన్లైన్ లో ఫాస్ట్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్నెట్ వాడుకునేందుకు వీలుగా కంప్యూటర్ ఉంటుంది. అందుకే దీనిని ఆఫీస్లతో పాటు ఇళ్ళల్లో కూడా ఎక్కువగా వాడుతుంటారు. అందువల్ల ప్రతి ఇంట్లో కూడా టీవీల లాగే కంప్యూటర్ కూడా ఉండటం సర్వ సాధారణం అయిపోయింది.అయితే చాలా మంది కూడా టీవీ, కంప్యూటర్ రెండూ డివైస్‌లను కొనడానికి ఎక్కువగా ఇష్టపడరు. కొంత మంది దగ్గర కంప్యూటర్ కొనే బడ్జెట్ ఉండదు. అందుకే ఇప్పుడు వారికి ప్రత్యేకంగా కంప్యూటర్ కొనుగోలు చేసే అవసరం లేకుండా కొత్త టెక్నాలజీని లాంచ్ చేసింది రిలయన్స్ జియో. ఇంతకీ ఆ టెక్నాలజీ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జియో ఇప్పుడు కేవలం ఒకే ఒక్క యాప్ సాయంతో స్మార్ట్ టీవిని కంప్యూటర్‌లాగా మార్చుకునే ఫెసిలిటీని ఇస్తుంది. ముఖ్యంగా ఇది మధ్య తరగతి వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. దీని వలన వాళ్ళకి సపరేట్ గా కంప్యూటర్ కొనే పని ఉండదు. ఎంచక్కా తమ టీవినే కంప్యూటర్ గా వాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. జియో ఈ అప్డేటెడ్ టెక్నాలజీని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ – 2024 ఈవెంట్‌లో కూడా పెర్ఫార్మ్ చేసింది. ఈ టెక్నాలజి పేరు జియో క్లౌడ్ పీసీ. ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో మీ స్మార్ట్ టీవీని ఏకంగా కంప్యూటర్‌గా మార్చుకోవచ్చని జియో తెలిపింది.స్మార్ట్ టీవీతో పాటు ఇంటర్నెట్ ఫెసిలిటీ, కీబోర్డ్, మౌస్, ఉంటే చాలు.. జియో క్లౌడ్ పీసీ యాప్ సహాయంతో టీవిని కంప్యూటర్ లాగా చేంజ్ చేసుకోవచ్చు. అందుకు ఫస్ట్ మీరు జియో క్లౌడ్ పీసీ యాప్‌లో లాగిన్ అవ్వాలి.
కంప్యూటర్ లాగానే స్మార్ట్ టీవీలో ఈమెయిల్స్, మెసేజింగ్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి పనులు చేసుకోవచ్చు. ఈ డేటా అంతా కూడా క్లౌడ్‌లోనే స్టోర్ అవుతుంది. కంప్యూటర్ కొనే స్థోమత లేని వారికి ఈ టెక్నాలజీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.అయితే, ఈ జియో క్లౌడ్ పీసీ యాప్‌ను ఎప్పుడు రిలీజ్ చేయనుందో? ఎంత ధరకు తీసుకురానుందో? ప్రస్తుతానికి పూర్తి వివరాలు తెలపలేదు జియో. కానీ అందుబాటు ధరలోనే తీసుకురానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే జియో వీటి వివరాలను తెలపనుంది. ఇదీ సంగతి. దీంతో ఈ టెక్నాలజీ సాయంతో మీ టీవిని కంప్యూటర్ గా మార్చుకోవచ్చు. మరి ఈ జియో క్లౌడ్ పీసీ టెక్నాలజీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.