ఆగస్టు 15న మరో అద్భుతానికి శ్రీకారం చుట్టనున్న ఇస్రో! ఏంటంటే..

ISRO: ఇస్రో సంస్థ అనేక ప్రయోగాలు ఇస్తోంది. ఇప్పటికే మంగళయాన్, చంద్రయాన, ఆదిత్య పేర్లతో ఇస్రో పలు అద్భుత ప్రయోగాలు చేసిన సంగతి తెలిసింది. తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

ISRO: ఇస్రో సంస్థ అనేక ప్రయోగాలు ఇస్తోంది. ఇప్పటికే మంగళయాన్, చంద్రయాన, ఆదిత్య పేర్లతో ఇస్రో పలు అద్భుత ప్రయోగాలు చేసిన సంగతి తెలిసింది. తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభివృద్ధి చెందిన దేశాలకు పోటీగా.. అతి తక్కువ  ఖర్చులో ఎన్నో స్పేస్ ప్రయోగాలను చేసింది. అంతేకాక అంతరిక్ష రంగంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు సాధించలేని ఘనతలను ఇస్రో సాధించింది. అంతేకాక ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాలు దేశ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మరింత ఇనుపడింప చేశాయి. చంద్రయాన్ -3 ప్రయోగం ద్వారా అరుదైన ఘనతను ఇస్రో తన ఖాతాలో వేసుకుంది. ఇది ఇలా ఉంటే.. ఆగష్టు 15వ తేదీనా మరో అద్భుత ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టనుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఇస్రో సంస్థ అనేక ప్రయోగాలు ఇస్తోంది. ఇప్పటికే చంద్రడు, సూర్యుడు, మార్స్ విషయంలో వివిధ ప్రయోగాలు చేసిన సంగతి తెలిసింది. మంగళయాన్, చంద్రయాన, ఆదిత్య పేర్లతో ఇస్రో పలు ప్రయోగాలు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్ తో ఇస్రో అద్భుతాలను సృష్టి చేస్తుంది. అంతేకాక అగ్ర దేశాలకు చెందిన స్పెస్ సెంటర్ లు మన వైపు చూసేలా ఇస్రో చేస్తుంది. ఇదే సమయంలో తాజాగా మరో అద్భుత ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్నిపురస్కరించుకుని ఆగష్టు 15వ తేదీన  ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

స్మాల్ శాటిలైట్ వెహికల్  (ఎస్‌ఎస్‌ఎల్‌వి)ని  వినియోగించి..ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్)ను ప్రయోగించేందుకు ఇస్రో రెడీ అయ్యింది. ఎస్‌ఎస్‌ఎల్‌వి థర్డ్ అండ్ ఫైనల్ డెవలప్మెంట్ రాకెట్ ఆగస్టు 15వ తేదీ ఉదయం 9:17 గంటలకు శ్రీహరికోట నుండి బయలుదేరుతుందని ఇస్రో ప్రకటించింది. ఎస్‌ఎస్‌ఎల్‌వి డీ3/ఈవోఎస్ 08గా ఈ మిషన్ కి నామకరణం చేశారు. ఈ రాకెట్ సుమారు 175.5 కిలోల బరువున్న మైక్రో-శాటిలైట్ ఈవోఎస్-08ని మోసుకెళ్లనుందని సమాచారం. ఈవోఎస్-08 ను ఐఎంఎస్-1 బస్సులో నిర్మించబడింది. ఇది ఎలక్రో ఆప్టికల్ ఇన్ ఫ్రారెడ్, జీఎన్ఎస్ఎస్-ఆర్, Sic Uv డోసిమీటర్ అనే  మూడు వినూత్న పేలోడ్ లను కలిగి ఉంటుంది.

ఇక ఇస్రో చేయనున్న ఈ ప్రయోగ ముఖ్య ఉద్దేశం..మైక్రో-శాటిలైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, మైక్రో-శాటిలైట్ బస్‌కు అనుగుణమైన పేలోడ్ ఇన్స్ట్రుమెంట్స్ ని క్రియేట్ చేయటం చేస్తుంది. అలానే  భవిష్యత్ ప్రయోగాల్లో శాటిలైట్స్ కి అవసరమైన కొత్త సాంకేతితను చేర్చడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నారు. ఈ మిషన్ ఎస్ఎస్ఎల్వీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తుందని ఇస్రో తెలిపింది. ఇక ఈవోఎస్-08 ప్రయోగాని చూడాలనుకునే వారు ఇస్రో అధికారిక వెబ్ సైట్ ద్వారా చూడొచ్చు. అలానే సోషల్ మీడియా ఛానెల్ లో కూడా ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా  వీక్షించవచ్చు.

Show comments