తక్కువ ధరకే ఇన్ఫీనిక్స్ నుంచి నోట్ 40 ప్రో 5జి రేసింగ్ ఎడిషన్.. ఫీచర్స్ అదుర్స్!

Infinix Note 40 Pro 5G Racing Edition: ఇన్ఫీనిక్స్ స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటాయి. వీటిలో మంచి ఫీచర్స్ ఉండటం వలన బడ్జెట్ వినియోగదారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

Infinix Note 40 Pro 5G Racing Edition: ఇన్ఫీనిక్స్ స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటాయి. వీటిలో మంచి ఫీచర్స్ ఉండటం వలన బడ్జెట్ వినియోగదారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

ఇన్ఫీనిక్స్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బడ్జెట్ ధరలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే వీటిలో మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి. అందుకే బడ్జెట్ వినియోగదారులు వీటిని ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. తాజాగా కంపెనీ మరో మోడల్ ని ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ నుంచి నోట్ 40 ప్రో 5జి రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో సరికొత్తగా విడుదల అయ్యింది. ఇక అదిరిపోయే ఫీచర్స్ తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ నేడు స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క స్క్రీన్, కెమెరా ఇంకా డిజైన్ కచ్చితంగా ఆకట్టుకుంటాయట. ఇక ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ అలాగే పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా దీని ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జి రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ అదిరిపోయే డిజైన్ తో వస్తుంది. ఎందుకంటే కంపెనీ ఈ ఫోన్ ని BMW గ్రూప్ సహకారంతో డిజైన్ చేసింది. అందువల్ల ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ విషయానికి వస్తే.. దీనికి ఎంతో దృఢమైన గొరిల్లా గ్లాస్ రక్షణగా ఉంటుంది. అందువల్ల ఫోన్ కింద పడ్డా కూడా స్క్రీన్ పగలదు. ఇంకా స్క్రీన్ పై ఎటువంటి గీతలు పడవు. ఈ స్క్రీన్ 6.67 ఇంచెస్ 3D కర్వుడ్ అమోల్డ్ తో సాలిడ్ గా డిజైన్ చేయబడింది. అలాగే ఇది 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో ఈ స్క్రీన్ ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7020 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇంకా 12GB ఫిజికల్ ర్యామ్,12GB అదనపు ర్యామ్ తో పాటు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ మొబైల్ రావడం విశేషం. ఈ ఫోన్ లో 11 లేయర్ VC కూలింగ్ ఇంకా JBL డ్యూయల్ స్టీరియో స్పీకర్లు హైలెట్ గా నిలుస్తాయి.

ఈ స్మార్ట్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 108MP మెయిన్ కెమెరా +2MP+2MP ట్రిపుల్ కెమెరాలని కలిగి ఉంది. ఇంకా అలాగే ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 2K వీడియోలు 30FPS తో చాలా సులభంగా షూట్ చేయగలమని ఇన్ఫినిక్స్ తెలిపింది. ఇది డీటీఎస్ ఫీచర్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 100W మల్టీ మోడ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 20W వైర్లెస్ ఛార్జ్ తో పాటు రివర్స్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ఫీచర్ ను కలిగి ఉండటం ఆకట్టుకునే అంశం. దీని ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ ను అన్ని ఆఫర్లతో కలిపి రూ. 18,999 రూపాయల ప్రారంభ ధరతో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఈ మొబైల్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

 

Show comments