ISRO: ఇన్‌శాట్-3DS ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో!

ప్రపంచంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకు ఉన్న ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే అనేక చారిత్రాత్మక ప్రయోగాలు చేసిన ఇస్రో..తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాతావరణపై పరిశోధనలు చేసేందుకు ఇన్ శాట్-3డీఎస్ అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.

ప్రపంచంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకు ఉన్న ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే అనేక చారిత్రాత్మక ప్రయోగాలు చేసిన ఇస్రో..తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాతావరణపై పరిశోధనలు చేసేందుకు ఇన్ శాట్-3డీఎస్ అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శనివారం వాతావరణ ఉపగ్రహమైన ఇన్ శాట్-3డీఎస్ ను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం సాయంత్ర ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. గతంలో ప్రయోగించిన ఇన్ శాట్-3డీ, ఇన్ శాట్-3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఈ ఇన్ శాట్-3డీఎస్ ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది.

శనివారం మరో సరికొత్త ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చంద్రయాన్ సిరీస్ లో ప్రయోగం చేసి.. చివరకు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే సూర్యుడిపై కూడా ప్రయోగం చేసింది. అలానే తరచూ వివిధ పరిశోధనల నిమిత్తం ఇస్రో ఉపగ్రహాల ప్రయోగిస్తుంది. అలానే విదేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా మన ఇస్రో సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పటికే విపత్తులు, వాతావరణంలో జరిగే మార్పులు, సముద్రంపై పరిశోధనలు చేసేందుకు ఇన్ శాట్ సిరీస్ లో ఉపగ్రహాలను పంపింది. తాజాగా ఇన్ శాట్-3డీఎస్ అనే మరో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. జీఎస్ఎల్వీ-ఎఫ్14 వాహన నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. వాతావరణం మెరుగుపర్చడానికి, భూమి, సముద్రం ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు.

ఇన్ శాట్-3డీఎస్ సుమారు 2,275 కిలోల బరువు ఉంటుంది. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లు ఉన్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికలు, భూమి, సముద్ర ఉపరితలాలపై పరిశోధన చేసి..సమాచారాన్ని పంపించనుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్ శాట్-3డీ, ఇన్ శాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేయనుంది. శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ ప్రయోగం మొదలైన 20 నిమిషాల తరువాత జియో సింక్రనస్ ట్రాన్స్ ఫర్  ఆర్బిట్ లో శాటి లైట్ ను ప్రవేశ పెడతారు. అనంతరం దశల వారీగా రెండు రోజుల పాటు కక్ష్యను మారుస్తారు.

Show comments