10 వేలలోపే అదిరిపోయే 5జీ ఫోన్.. ఈ ఫోన్ అస్సలు మిస్ కాకండి..

Best Budget 5G SmartPhone: ఇప్పుడు అందరూ 5జీ ఫోన్లు కొంటున్నారు. కానీ, 5జీ ఫోన్లు కాస్త కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి. కానీ, ఇప్పుడు బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్ మార్కెట్ లోకి వచ్చేస్తోంది.

Best Budget 5G SmartPhone: ఇప్పుడు అందరూ 5జీ ఫోన్లు కొంటున్నారు. కానీ, 5జీ ఫోన్లు కాస్త కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి. కానీ, ఇప్పుడు బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్ మార్కెట్ లోకి వచ్చేస్తోంది.

ప్రస్తుతం మార్కెట్ లోకి వస్తున్నవి అన్నీ 5జీ ఫోన్లే. 2024లో అయితే ధర ఏదైనా కూడా 4జీ ఫోన్లు విడుదల కావడం కష్టం అనే చెప్పాలి. అయితే అన్నీ ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్ కొనాలి అంటే ప్రస్తుతం కాస్త ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే చాలా మంది స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకున్నా 5జీ ఫోన్ అనగానే కాసత జంకుతున్నారు. కానీ, ఇప్పుడు మార్కెట్ లోకి ఒక బడ్జెట్ 5జీ ఫోన్ అయితే రాబోతోంది. ఇది నిజంగా బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్ డీల్ అనే చెప్పాలి. ఇంక ఈ ఫోన్ ధర ఎంత? ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

బెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది పోకో కంపెనీ. ఈ కంపెనీకి ఇప్పుడు భారత్ లో చాలా మంచి మార్కెట్ ఉంది. ఇప్పటికే 5జీలో కొన్ని బడ్జెట్ ఫోన్స్ ఉన్నాయి. కానీ, వాటికి దాదాపు రూ.15 వేల వరకు పెట్టాల్సి ఉంటుంది. కానీ, పోకో మాత్రం కేవలం రూ.9,499 నుంచే 5జీ ఫోన్ ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆ మోడల్ పేరు POCO M6 5G ఫోన్. ఈ ఫోన్ సేల్స్ అధికారికంగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఫోన్ లో 4 జీబీ నుంచి 8 జీబీ వరకు ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ కి 8 జీబీ వరకు ర్యామ్ ఎక్స్ పాండ్ చేసుకునే ఆప్షన్ ఉంది. స్టోరేజ్ అయితే 128జీబీ, 256 జీబీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంక ప్రాసెసర్ విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5 జీ ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ప్రాసెసర్ కు 428K+ అంటుటూ స్కోర్ వచ్చింది. ఇంక పోకో ఎం6 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13, ఎంఐయూఐ 14తో వస్తోంది.

ఇందులో బెస్ట్ విషయం ఏంటంటే.. పోకో కంపెనీ ఈ మోడల్ కి 2 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. నిజానికి ఇప్పుడు చాలా కంపెనీలు ఆండ్రాయిడ్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ పై గ్యారెంటీ ఇప్పవడం లేదు. ఇంక ఈ ఫోన్ 6.74 ఇంచెస్ లార్జ్ స్క్రీన్ తో వస్తోంది. 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండటం స్పెషల్ అట్రాక్షన్ అని. ఈ ఫోన్ 600 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తోంది. 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా, ఫ్రంట్ 5 ఎంపీ కెమెరా ఉంటాయి. ఇంక బ్యాటరీ అయితే 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ ఫోన్ కి 18+ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఇందులో ఇంకా చాలా ఇంట్రస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3 స్లాట్ సిమ్ ట్రేతో వస్తోంది. 2 సిమ్స్, మెమొరీ కార్డు పెట్టుకోవచ్చు. ఈ ఫోన్ 2 కలర్స్ ఉన్నాయి. గెలాక్టిక్ బ్లాక్, ఓరియన్ బ్లూ కలర్స్ లో ప్రీమియం స్కై డాన్స్ డిజైన్ లో వస్తోంది. ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ఫీచర్స్ తో ఫోన్ అంటే చాలా బెస్ట్ డీల్ అనే చెప్పాలి.

ఇదే పోకో కంపెనీ నుంచి ఎం6 ప్రో 5జీ ఫోన్ ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ మోడల్ లో కూడా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 4 జెనరేషన్-2.. ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్రీమియం గ్లాస్ డిజైన్, 6.79 ఇంచెస్ స్క్రీన్, 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 జీబీ వరకు ర్యామ్ ని పెంచుకునే ఆప్షన్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13, ఎంఐయూఐ 14తో ఈ ఫోన్ రన్ అవుతుంది. వీడియో కూడా ఎంతో వైబ్రెంట్ కలర్స్ తో వస్తుంది. బడ్జెట్ లో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అనే చెప్పాలి. దీని ఎమ్మార్పీ రూ.15,999కాగా 28 శాతం డిస్కౌంట్ తో రూ.11,480కే అందిస్తున్నారు. దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సెలక్టెడ్ బ్యాంక్స్ పై రూ.1500 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి.. ఈ POCO M6 PRO 5G ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Show comments