Jobs: పదో తరగతి చదివితే చాలు.. నెలకు లక్ష సంపాదించవచ్చు!

Jobs: ఈ రోజుల్లో పెద్దగా చదువుకోకపోయినా మంచి మంచి ఆదాయ మార్గాలు ఉన్నాయి. వాటిలో డ్రోన్ పైలట్ ఒకటి.

Jobs: ఈ రోజుల్లో పెద్దగా చదువుకోకపోయినా మంచి మంచి ఆదాయ మార్గాలు ఉన్నాయి. వాటిలో డ్రోన్ పైలట్ ఒకటి.

ఈరోజుల్లో చదువుకునేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. పెద్ద పెద్ద డిగ్రీ పట్టాలు తీసుకుంటున్నారు. అయితే చాలా మంది కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అయితే పెద్ద పెద్ద డిగ్రీలతో పని లేకుండా కేవలం పదో తరగతి విద్యార్హత ఉన్నా చాలు.. లక్షలు సంపాదించే మార్గాలు ఉన్నాయి. ఇంతకీ అలాంటి పని ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డ్రోన్ పైలెట్.. మీరు కేవలం ఐదు రోజుల్లోనే ట్రైనింగ్ పూర్తి చేసుకుని సర్టిఫైడ్‌ డ్రోన్‌ పైలట్‌ అయితే ఇక మీకు తిరుగుండదు అనే చెప్పాలి. చాలా మందికి దీని గురించి అవగాహన ఉండదు కానీ దీని వల్ల మంచి సంపాదన ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తుంది. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. అందువల్ల డ్రోన్ అవసరం చాలా రంగాలకు ఉంటుంది. దీనికి కాస్త ట్రైనింగ్ తీసుకుంటే చాలు.. మీ సొంత ఊరిలోనే వ్యవసాయ పనుల్లో డ్రోన్‌ సేవలను అందించవచ్చు. దీని ద్వారా నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా ఆదాయాన్ని పొందవచ్చు.

మంచి నైపుణ్యం కలిగిన డ్రోన్ పైలట్ల అవసరం పెరుగుతోంది. అందుకే చాలా రంగాలలో డ్రోన్ పైలట్లకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండీడ్, నౌక్రి, లింక్డ్‌ఇన్ వంటి వెబ్‌సైట్‌లలో మనం డ్రోన్ పైలట్ జాబ్స్ వెతుకోవచ్చు. బోట్స్ & డ్రోన్స్ ఇండియా, డ్రోన్ డెస్టినేషన్ వంటి వెబ్‌సైట్‌లలో జాబ్స్ చూసుకోవచ్చు. అలాగే సోషల్ మీడియాలో కూడా కొన్ని డ్రోన్ కంపెనీలు ఉద్యోగుల కోసం యాడ్స్ ఇస్తుంటాయి. సినిమా, మీడియా రంగాలకు కూడా డ్రోన్ పైలట్లు అవసరం. కొన్నిస్పెషల్ ఏరియల్ షాట్‌లను క్యాప్చర్ చేయడానికి సినిమా, మీడియా రంగంలో అవకాశాలు ఉంటాయి. అలాగే వంతెనలు, విద్యుత్ లైన్లు, పైప్‌లైన్‌ల వంటి వాటిని చెక్ చేయడానికి డ్రోన్ పైలట్లు అవసరం. సైబర్‌ సెక్యూరిటీ రంగంలోనూ డ్రోన్లను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.

2030నాటికి డ్రోన్‌ ఇండస్ట్రీ మార్కెట్‌ రూ.92,500 కోట్లకు (11 బిలియన్‌ డాలర్లు) పెరగనుందని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు. రాబోయే పదేళ్లలో డ్రోన్‌ రంగంలో ఇండియా కచ్చితంగా గ్లోబల్‌ లీడర్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో 400కు పైగా డ్రోన్‌ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు స్టార్టప్‌లు ఉన్నాయి. కార్గో, అగ్రికల్చర్, సర్వీస్ , సర్వే-మ్యాపింగ్‌ వంటి రంగాల్లో ఇప్పటికే డ్రోన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక గవర్నమెంట్, అకడమిక్, ప్రైవేటువీ కలిపి దేశంలో మొత్తం 120 సర్టిఫైడ్‌ శిక్షణ సంస్థలున్నాయి. డ్రోన్ పైలట్‌ కోర్సు కి ట్రైనింగ్​ 5 రోజులు మాత్రమే ఉంటుంది. దీనికి రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్య ఫీజు ఉంటుంది. మనం డ్రోన్లను ఆన్‌లైన్‌లో గవర్నమెంట్​ రూల్స్ ప్రకారం రిజిస్టర్‌ చేయాలి. ఎందుకంటే ఈ డ్రోన్లను ఆపరేట్‌ చేసే పైలట్‌కు కచ్చితంగా లైసెన్స్‌ కావాలి. థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ కూడా ఉండాలి.

డిఫెన్స్ రంగానికి కి చెందిన రెడ్‌ జోన్‌స్, విమానాశ్రయాలకు 12 కి.మీ.ల పరిధిలో తప్ప మిగిలిన గ్రీన్‌ జోన్‌లో ఎక్కడైనా ఎలాంటి పోలీసుల పర్మిషన్ అవసరం లేకుండా 400 అడుగుల ఎత్తు వరకు డ్రోన్లను ఆపరేట్‌ చేయవచ్చు. దేశంలో 90శాతం ఎయిర్‌స్పేస్‌ గ్రీన్‌జోన్‌గానే ఉండడం డ్రోన్‌ సెక్టార్​కు మంచి ఛాన్స్ అనే చెప్పవచ్చు. ఇదీ సంగతి. ఇలా మీరు కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు డ్రోన్ పైలట్ గా మారి లక్షలు సంపాదించవచ్చు. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments