యాపిల్ ఎయిర్ పాడ్స్ లో కెమెరా సెన్సార్! ఒక్క ఆలోచనతో 3 కొత్త ప్రొడక్ట్స్

Apple is Working On To Mass Produce Airpods With IR Camera Sensor: మరో సరికొత్త ఆవిష్కరణతో యాపిల్ సంస్థ తమ వినియోగాదారులను మెస్మరైజ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఎయిర్ పోడ్స్ లో కెమెరా సెన్సార్స్ పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Apple is Working On To Mass Produce Airpods With IR Camera Sensor: మరో సరికొత్త ఆవిష్కరణతో యాపిల్ సంస్థ తమ వినియోగాదారులను మెస్మరైజ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఎయిర్ పోడ్స్ లో కెమెరా సెన్సార్స్ పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

యాపిల్ ఎప్పుడూ తన కొత్త రకమైన ప్రొడక్ట్స్ తో ఇంప్రెస్స్ చేస్తూనే ఉంటుంది. ప్రపంచం మొత్తం డెస్క్ టాప్ కంప్యూటర్స్ వాడుతున్న టైములో మొట్ట మొదటిగా CPU లేని కంప్యూటర్ ని ప్రపంచానికి పరిచయం చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తరవాత అందరూ లాప్టాప్స్ తయారీలో బిజీగా ఉన్నప్పుడు, ఒక చిన్న బాక్స్ లో CPUని పెట్టొచ్చు అని మళ్ళి ఇంకో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది యాపిల్. ఇప్పుడు కూడా అదే రీతిలో యాపిల్ 2026కి ఎయిర్ పాడ్స్ కి కెమెరా సెన్సార్ పెట్టాలని డిసైడ్ అయ్యింది.

ఐఫోన్, ఐప్యాడ్స్ లో ఉండే ఫేస్ అన్లాక్ టెక్నాలజీలో ఇన్ఫ్రారెడ్ కెమెరా సెన్సార్స్ ని యాపిల్ యూజ్ చేస్తుంది. ఇప్పుడే అవే కామేరాస్ ని యాపిల్ ఎయిర్ పాడ్స్ లో కూడా పెట్టాలని యాపిల్ నిర్ణయించుకుంది. అసలు ఎయిర్ పోడ్స్ కి కెమెరా సెన్సార్ని ఎందుకు పెడుతున్నారు అంటే. యాపిల్ ఇప్పటికే విజన్ ప్రొడక్ట్స్ ని లాంఛ్ చేసింది. ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కోసం రీసెర్చ్ చేస్తుంది. దానిలో భాగంగానే ముందు చూపుతో, ఎయిర్ పాడ్స్ కి కెమెరా సెన్సార్ ని ఫిక్స్ చేస్తున్నారు. పైగా ఈ ఇన్ఫ్రా రెడ్ కెమెరా సెన్సార్స్ కి చుట్టూ ఉండే పర్యావరణాన్ని గుర్తించి, ఆ యాంబియాన్స్ కి తగ్గట్టుగా మోడ్స్ ని ఆటోమేటిక్ గా మార్చుకుంటుంది. యాపిల్ ఇప్పుడు ఈ ఎయిర్ పాడ్స్ ని మాస్ ప్రొడక్షన్ చెయ్యడానికి నిర్ణయించుకుంది. మొత్తం వీటిని 20 మిలియన్ పెయిర్స్ మార్కెట్ లోకి రిలీజ్ చెయ్యాలని టార్గెట్. కాని ఫస్ట్ స్టెప్ కింద 10 మిలియన్ ఎయిర్ పాడ్స్ ని తయారు చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కి B798 అనే కోడ్‌ ని పేరుగా పెట్టారు. యూజర్స్ లెన్స్ ఇంకా ఫ్రేమ్‌లు కొనాలిసిన పని లేకుండా. స్మార్ట్ గ్లాసెస్ కొంటె ఇందులోనే అన్ని ఫెసిలిటీస్ వచ్చేలా యాపిల్ ప్లాన్ చేస్తుంది. ఐ సైట్ ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ విజన్ సెట్ లోనే సైట్ యజస్ట్ చేసుకునేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే దీనితో పాటు యాపిల్ 20 ఇంచెస్ ఫోల్డబుల్ మ్యాక్ బుక్ పైన కూడా వర్క్ చేస్తుంది. దీన్ని 2026లో మాస్ ప్రొడక్షన్ చేసి 2027లో లాంఛ్ చేస్తామని యాపిల్ చెప్తుంది. అలాగే 7.9 ఇంచ్ ఫోల్డబుల్ ఐఫోన్ ని కూడా తయారు చేస్తున్నట్టు చెప్పారు.

Show comments