Google Pixel 9 Proలో ‘ADD ME’ ఫీచర్ అదుర్స్! ఇక ఎవరిని అడగకుండా గ్రూప్ ఫోటో దిగొచ్చు!

Google Pixel 9 Pro: మార్కెట్లో ఎన్నో రకాల అప్ డేటెడ్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అలరిస్తున్నాయి. అందులో 'Google Pixel 9 Pro' ఒకటి.

Google Pixel 9 Pro: మార్కెట్లో ఎన్నో రకాల అప్ డేటెడ్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అలరిస్తున్నాయి. అందులో 'Google Pixel 9 Pro' ఒకటి.

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల అప్ డేటెడ్ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. వినియోగదారులకు అనుకూలంగా స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లని ప్రవేశపెడుతున్నాయి. వాటిలో ‘Google Pixel 9 Pro’ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇందులోని ఫీచర్లు మాత్రం వినియోగదారులను భలేగా అలరిస్తున్నాయి. ఇందులో ఉండే ‘ADD ME’ ఫీచర్ అయితే ఎంతో ఆసక్తికరంగా ఉంది.గతంలో ఈ ఫీచర్ కి సంబంధించిన ప్రోమో వీడియో రాగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.. ఈ ఫీచర్ తో మనం ఒకేసారి ఒకే ప్రదేశంలో ఎవరి సహాయం లేకుండా గ్రూప్ ఫోటోలను చాలా ఈజీగా తీయవచ్చు. అదెలాగో ఇపుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

మనం మన కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఏవైనా టూర్ల కోసం బయటకి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా గ్రూప్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటాము. అయితే గ్రూప్ ఫోటో తీసుకునే సమయంలో మనం ఫేస్ చేసే ప్రధాన సమస్య ఏంటంటే ఎవరినో ఒకరిని మిస్ అవుతాం. ఒకవేళ గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటే కచ్చితంగా వేరే వాళ్ళ సాయం చాలా అవసరం. అందుకు మనం కొత్తవాళ్ళని ఫోటో తీయమని సహాయం అడుగుతాం. కానీ అన్ని వేళలా వాళ్ళు మనకు సాయం చేయకపోవచ్చు. అందువల్ల ఒక్కోసారి గ్రూప్ ఫోటో కావాలనుకునేవారికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా వాళ్ళు మన గ్రూప్ ఫోటో తీసినా కానీ ఆ ఫోటో క్లారిటీగా రాకపోవచ్చు.

అయితే యాడ్ మీ ఫీచర్ తో మనకు ఆ ఇబ్బంది ఉండదు. ఈ ఫీచర్ తో ఎవరి సహాయం లేకుండా ఎంచక్కా మనం గ్రూప్ ఫొటోస్ దిగవచ్చు. పైగా ఫొటోస్ కూడా చాలా క్లారిటీగా దిగొచ్చు. ఇది AI సహాయంతో పనిచేసే ఫీచర్. ఈ ఫీచర్ ని ఎలా వాడాలంటే.. ముందుగా, గ్రూప్ ఫోటోని తీసుకోవాలి. అయితే ఫోటో తీసుకునేటప్పుడు గ్రూప్‌లో మిస్ అయిన పర్సన్ కోసం ఓ ప్లేస్ వదిలేసుకోవాలి.. గ్రూప్ లో వారికి ఇష్టమైన ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మీరు గ్రూప్ ఫోటో తీసుకున్న తరువాత ఆ ఫ్రేమ్‌ను చెక్ చేసుకోవాలీ. ఆ తరువాత ఆ గ్రూప్ ఫొటోలో మిస్ అయిన వ్యక్తిని ఫస్ట్ వారి కోసం వదిలేసిన ప్లేసులో ఉంచి రెండవ సారి సింగిల్ ఫోటో తీసుకోవాలి.

అప్పుడు మీరు రెండు ఫోటోలను కలిగి ఉంటారు. ఒకటి గ్రూప్ ఫోటో మరొకటి కేవలం ఒక వ్యక్తి ఉన్న ఫోటో. ఇప్పుడు ఆ వ్యక్తిని గ్రూప్ ఫొటోలో యాడ్ చెయ్యడానికి ఈ యాడ్ మి ఫీచర్ ని అప్లై చేసుకోవాలి.. ఈ ఫీచర్ ఆ రెండు ఫోటోలను కలిపేస్తుంది. సింగిల్ గా దిగిన వ్వ్యక్తిని ముందుగా తీసుకున్న గ్రూప్ ఫొటోలో ఆ వ్యక్తి కోరుకున్న ప్లేసులో యాడ్ చేస్తుంది. దాంతో అందరూ కలిసి ఉన్న గ్రూప్ ఫోటోగా ఈ ఫీచర్ క్లారిటీగా చేంజ్ చేస్తుంది. ఈ ఫీచర్ సహాయంతో ఎలాంటి ఫోటో ఎడిటింగ్ లేదా క్రాపింగ్ అవసరం లేకుండా AI టెక్నాలజీ ద్వారా ఒకే ఫోటోగా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఈ టెక్నాలజీతో మనం ఈజీగా వేరే వాళ్ళ సహాయం లేకుండా గ్రూప్ ఫోటోలని తీసుకోవచ్చు. ఈ సూపర్ ఫీచర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments