SNP
SNP
వన్డే వరల్డ్ కప్ మెగా సమరానికి సర్వం సిద్ధమైంది. 2019 వరల్డ్ కప్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో భారత్ వేదికగా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ నేడు జరగనుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తొలి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? టోర్నీని విజయంతో ఆరంభించి.. శుభారంభాన్ని ఎవరు అందుకుంటారనే దానికి కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది? ఎవరి బలం ఎంత? ఎవరి బలహీనతలు ఏంటనే విషయాలను ఇప్పుడు చర్చిద్దాం.
ఇంగ్లండ్
ఈ వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్ చాలా పటిష్టంగా ఉంది. చాలా మంది క్రికెట్లు సైతం ఇంగ్లండ్ హాట్ ఫేవరేట్స్‌లో ఒకటిగా పేర్కొంటున్నారు. కెప్టెన్ జోస్ బట్లర్, లివింగ్‌స్టన్, జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, మెయిన్ అలీ రూపంలో వారికి బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా ఉంది. అలాగే మార్క్ వుడ్, క్రిస్ ఓక్స్, సామ్ కరన్‌తో పేస్ ఎటాక్ సైతం పటిష్టంగా ఉంది. స్టోక్స్, మెయిన్ అలీ, సామ్ కరన్ రూపంలో క్వాలిటీ ఆల్‌రౌండర్లు వారి సొంతం. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ స్పిన్ బౌలింగ్‌ను చూసుకుంటారు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ జట్టు అన్ని విభాగాల్లో ఎంతో బలంగా కనిపిస్తోంది. బలహీనతలు సైతం పెద్దగా కనిపించడం లేదు. న్యూజిలాండ్‌కు ఉన్న క్వాలిటీ పేస్‌కు ఇబ్బంది పడకుండా ఆడగలిగితే.. ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలుస్తుంది.
న్యూజిలాండ్
గత వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో దురదృష్టంగా కొద్ది ఓడిన న్యూజిలాండ్ ఈ సారి అలాంటి వాటికి తావులేకుండా కప్పు కొట్టాలని దృఢసంకల్పంతో ఉంది. కివీస్ టీమ్ సైతం ఎంతో పటిష్టంగా ఉంది. డెవాన్ కాన్వె, విల్ యంగ్, డార్లీ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, సాంట్నర్‌తో వారి బ్యాటింగ్ బలంగానే ఉంది. కేన్ విలియమ్సన్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడం వారికి పెద్ద మైనస్. అతను బహుషా తొలి మ్యాచ్ ఆడకపోవచ్చు. ఇక బౌలింగ్‌లో బ్లాక్ క్యాప్స్ ప్రత్యర్థులను భయపెట్టేలా ఉంది. ట్రెంట్ బౌల్ట్ వారి ప్రధాన అస్త్రం. అలాగే లూకీ ఫెర్గుసన్, మాట్ హెన్రీ సైతం సోధీతో వారి బౌలింగ్ శత్రుదుర్భేద్యంగా ఉంది. బలహీనతలు అంటే బ్యాటింగ్ అనే చెప్పాలి. బౌలింగ్ పరంగా బాగున్న కివీస్ కాస్త బ్యాటింగ్‌లోనే వీక్‌గా కనిపిస్తోంది.
తుది జట్లు(అంచనా)
ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్/హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్/రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాలు బలహీనతలు విశ్లేషించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. మరి ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారు? అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A rematch of the 2019 Final kicks things off at #CWC23 🏆
Who’s your pick to win the opener? 👀 pic.twitter.com/EdBOv6rDOJ
— ICC Cricket World Cup (@cricketworldcup) October 5, 2023
ఇదీ చదవండి: ధోని అసలు కెప్టెనే కాదు! రవిచంద్రన్ అశ్విన్ సంచలన స్టేట్‌మెంట్