SNP
Under 19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఇండియా-ఆస్ట్రేలియా జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ ఆదివారం ఈ ఫైనల్ జరగనుంది. అయితే.. భారత యువ జట్టుపై కాస్త ఎక్కువ బాధ్యతే ఉంది. పగ తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Under 19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఇండియా-ఆస్ట్రేలియా జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ ఆదివారం ఈ ఫైనల్ జరగనుంది. అయితే.. భారత యువ జట్టుపై కాస్త ఎక్కువ బాధ్యతే ఉంది. పగ తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
వన్డే వరల్డ్ కప్ 2023.. భారత క్రికెట్ అభిమానుల హృదయాలను గాయపర్చిన టోర్నీ. రోహిత్ శర్మ కెప్టెన్‌గా.. వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచి, ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్లోకి అడుగుపెట్టిన టీమిండియా.. ఒక్క మ్యాచ్ ఓటమితో వరల్డ్ కప్‌ను చేజార్చకుంది. వరల్డ్ కప్ ఎత్తాలని రోహిత్ ఎంతో ఆశపడ్డాడు. అందుకు కావాల్సినంత కష్టపడ్డాడు. రోహిత్ వరల్డ్ కప్ ఎత్తుతుంటే చూడాలని వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానులు ఆశపడ్డారు. వరల్డ్ కప్ గెలవాలనే లక్ష్యంతో రోహిత్, కోహ్లీలతో పాటు జట్టులో 11 మంది ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. కానీ, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఆ ఓటమి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలతో కన్నీళ్లు పెట్టించింది.
మ్యాచ్ తర్వాత గ్రౌండ్‌లో కన్నీళ్లు పెట్టుకుంటున్న రోహిత్, కోహ్లీని చూసి.. యావత్ దేశం కంటతడి పెట్టింది. వారిద్దరితో పాటు మొమమ్మద్ సిరాజ్ సైతం గ్రౌండ్‌లోనే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. సిరాజ్‌ను బుమ్రా ఓదారుస్తున్న దృశ్యాలు ఇంకా క్రికెట్ అభిమానుల కళ్లముందు కదలాడుతూ ఉంటాయి. అయితే.. ఆ కన్నీళ్లను మిగిల్చిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇండియాకు రానే వచ్చింది. సీనియర్లతో కన్నీళ్లు పెట్టించిన ఆస్ట్రేలియాకు ఆ బాధ ఎలా ఉంటుందో చూపించేందుకు యువ క్రికెటర్లు సిద్ధం అవుతున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునేందుకు భారత అండర్ 19 జట్టు రెడీగా ఉంది.
ఈ ఆదివారం అండర్ 19 వన్డే వరల్డ్ కప్ కోసం భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో ఒక్క ఓటమి కూడా లేకుండా భారత జట్టు ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఉదయ్ సహరన్ కెప్టెన్సీలోని యువ టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. జట్టులోని కులకర్ణి, ముషీర్ ఖాన్, సచిన్ దాస్, రాజ్ లింబాని, సౌమి పాండే అదరగొడుతున్నారు. ముఖ్యంగా సెమీ ఫైనల్‌లో టీమిండియా 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. 248 పరుగుల టార్గెట్‌ను ఛేదించి.. టీమ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చాటిచెప్పింది. మరోవైపు ఆస్ట్రేలియా సైతం పటిష్టంగానే ఉంది. మరి ఆదివారం జరగబోయే ఫైనల్లో యంగ్ టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా సీనియర్ల మాదిరే కన్నీళ్లు పెడుతుందా? చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
WTC23 Final 🔄 CWC23 Final 🔄 #U19WorldCup 2024 Final
It’s 🇮🇳 vs 🇦🇺 again! pic.twitter.com/sowFs8Gv03
— ICC (@ICC) February 8, 2024