క్రికెట్ అభిమానులకు హార్దిక్ పాండ్యా ఎందుకు నచ్చడం లేదు?

దేశం మొత్తం టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవాలని కోరుకుంటుంది. ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులంతా తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కనపెట్టి ఒక్క రోహిత్‌ సేనకే సపోర్ట్‌గా నిలిచింది. రోహిత్‌ వర్సెస్‌ కోహ్లీ, జడేజా వర్సెస్‌ సూర్య లాంటి సిల్లీ ఫైట్స్‌ను వదిలేసి.. టీమిండియా జపం చేస్తున్నారు. ఎందుకంటే భారత్‌ వరల్డ్‌ కప్‌ గెలవడం ముఖ్యం. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ టీమిండియా క్రికెటర్‌ విమర్శల పాలు అవుతున్నాడు. అతనెవరో కాదు హార్డిక్‌ పాండ్యా. టీమిండియాలో ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో ఎక్కువమంది హేటర్స్‌ ఉన్న ప్లేయర్‌ ఎవరంటే పాండ్యా అనే చెప్పాలి.

టాలెంట్‌ పరంగా హార్డిక్‌ పాండ్యా ఓ అద్భుతమైన ఆటగాడు. టీమిండియాకు దొరికిన ఆణిముత్యం లాంటి ఆల్‌రౌండర్‌. ప్రస్తుతం అతనే భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌, భవిష్యత్తులో అతనే కెప్టెన్‌ అనే వాదన కూడా ఉంది. ఇంత ఘనత ఉన్నా కూడా క్రికెట్‌ అభిమానుల్లో చాలా మందికి పాండ్యా అంటే అంతగా ఇష్టమొండదు. అందుకు కారణం.. పాండ్యా బిహేవియర్‌ అని చాలా మంది అంటుంటారు. గ్రౌండ్‌లో ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ముఖ్యంగా క్రెడిట్‌ దొబ్బేసేందుకు చూస్తుండానికి అతనిపై విమర్శలు ఉన్నాయి. సీనియర్‌ ఆటగాళ్లతో ఓవర్‌గా బిహేవ్‌ చేయడం. ధోని లాంటి లెజెండ్‌ మ్యాచ్‌లో కాకుండా కామెంటేటర్లు మాట్లాడుతున్న సమయంలో భుజంపై చేతులేస్తూ కాస్త అగౌరవంగా వ్యవహరించడం కూడా పాండ్యాపై నెగిటివ్‌ ఇంప్యాక్ట్‌ పడటానికి కారణం అయ్యాయి.

అలాగే అతను టీమ్‌ సభ్యులతో ఉంటే ఓవర్‌ యాక్టివ్‌నెస్‌ కూడా చాలా మందికి నచ్చదు. తానే టీమిండియాలో సూపర్‌స్టార్‌ అన్నట్లు, టీమ్‌ మొత్తం తనపైనే ఆధారపడి ఉన్నట్లు వ్యవహరిస్తున్నాడు. రోహిత్‌ శర్మ అందుబాటులో లేని సమయంలో కెప్టెన్‌గా వ్యవహరించే పాండ్యా.. ఆటగాళ్లపై బూతులతో విరుచుకుపడటం కూడా చాలా మంది పాండ్యాను అసహ్యించుకునేందుకు కారణం అయ్యాయి. ఐపీఎల్‌ సందర్భంగా షమీ లాంటి సీనియర్‌ ప్లేయర్‌పై పాండ్యా వ్యవహరించిన తీరు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు వెగటు పుట్టించింది. కాస్త కెప్టెన్సీ రాగానే.. దాన్ని ఓ బాధ్యతలా కాకుండా పెత్తనం చెలాయించే ఓ పదవిలా భావిస్తుండని కూడా ఓ వాదన ఉంది. పైగా.. తోటి ఆటగాళ్లు హాఫ్‌ సెంచరీ, సెంచరీకి చేరువలో ఉంటే.. సెల్ఫీస్‌నెస్‌తో అవి పూర్తికాకుండా చేస్తాడనే విరమ్శ కూడా పాండ్యాపై బలంగా ఉంది.

వెస్టిండీస్‌తో సిరీస్‌లో తిలక్‌ వర్మ 49 పరుగుల వద్ద ఉన్న సమయంలో సిక్స్‌ కొట్టాడు. తాజాగా వరల్డ్‌ కప్‌లో కేఎల్‌ రాహుల్‌ సెంచరీకి దగ్గరవుతున్న తరుణంలో అనవసరంగా సిక్స్‌ కొట్టి రాహుల్‌ను సెంచరీ చేయనివ్వకుండా చేశాడు. ఇలా అనేక విషయాల్లో హార్దిక్‌ పాండ్యా తీరు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. ఇప్పటికైనా పాండ్యా తన తీరు మార్చుకోవాలని క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఆటగాడిగా పాండ్యా అద్భుతమైన క్రికెటర్‌ అయినా.. కాస్త బిహేవియర్‌, మైండ్‌సెట్‌ మార్చకుంటే.. గొప్ప క్రికెటర్‌ అవుతాడని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఓడిపోతాం అనుకున్న మ్యాచ్‌ల్లో.. కోహ్లీ గెలిపించిన బెస్ట్‌ 6 మ్యాచ్‌లు ఇవే!

Show comments