T20 World Cup: క్రికెట్‌ చచ్చిపోతుందా? WC మ్యాచ్‌ల్లో ఖాళీ స్టేడియాలకు అసలు కారణం ఏంటంటే?

T20 World Cup 2024, WI vs PNG: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా స్టేడియాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో క్రికెట్‌ చచ్చిపోతుంది అని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అసలు స్టాండ్స్‌ ఖాళీగా ఉండేందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

T20 World Cup 2024, WI vs PNG: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా స్టేడియాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో క్రికెట్‌ చచ్చిపోతుంది అని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అసలు స్టాండ్స్‌ ఖాళీగా ఉండేందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభమైంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు కూడా ముగిశాయి. తొలి మ్యాచ్‌లో కెనడాపై ఆతిథ్య అమెరికా జట్టు ఘన విషయం సాధించింది. అలాగే రెండో మ్యాచ్‌లో పీఎన్‌జీపై ఆతిథ్య వెస్టిండీస్‌ టీమ్‌ గెలిచింది. అయితే.. వీటిలో పీఎన్‌జీ-వెస్టిండీస్‌ మధ్య మ్యాచ్‌కు అసలు ప్రేక్షకులే రాలేదు. ఏదో పది పదిహేను మంది కనిపించారు తప్పితే.. స్టేడియం అంతా బోసి పోయి కనిపించింది. టీ20 వరల్డ్‌ కప్‌ లాంటి మ్యాచ్‌లకు ప్రేక్షకులను ఆదరణ లేకపోవడం క్రికెట్‌ అభిమానులను కలవరపెడుతోంది.

ఈ క్రమంలోనే క్రికెట్‌ చచ్చిపోతుంది అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఒక ఉపఖండంలో తప్పితే క్రికెట్‌కు ఎక్కడా పెద్దగా ఆదరణ లేదని, ఐసీసీ కూడా వేరే చోటు క్రికెట్‌ను ప్రమోట్‌ చేసేందుకు కావాల్సినంత కృషి చేయడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. మరీ వరల్డ్‌ కప్‌లో వెస్టిండీస్‌లాంటి పెద్ద టీమ్‌ ఆడుతున్న సమయంలో వెస్టిండీస్‌లో కూడా జనం కాకపోతే పరిస్థితి ఏంటని అంటున్నారు. వెస్టిండీస్‌-పీఎన్‌జీ మ్యాచ్‌ సమయంలో ఖాలీ స్టాండ్స్‌ ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ కొంతమంది ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అయితే.. స్టేడియాలు అలా ఖాళీగా ఉండేందుకు అసలు కారణం వేరే ఉందంటూ క్రికెట్‌ నిపుణులు అంటున్నారు.

మ్యాచ్‌లు ఉదయం పూట నిర్వహించడం, పైగా టికెట్ల ధర చాలా అధికంగా ఉండటం కూడా క్రికెట్‌ అభిమానులు స్టేడియానికి రాకపోవడానికి కారణం అవుతుందని అంటున్నారు. అలాగే చిన్న టీమ్స్‌ మ్యాచ్‌లు కావడం కూడా అభిమానుల ఆనాసక్తికి కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇండియా, ఆస్ట్రేలియా లాంటి టీమ్స్‌ బరిలోకి దిగే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని పేర్కొంటున్నారు. కరేబియన్‌ క్రికెట్‌ అభిమానులు ప్యాషనేట్‌గా ఉంటారని, సీపీఎల్‌లో ఏ స్టేడియం ఖాళీగా లేదని, అన్ని నిండిపోయి ఉన్నాయని తెలిపారు. టిక్కెట్‌ ధరలు, మార్నింగ్‌ టైమ్‌లో మ్యాచ్‌ ఉండటమే స్టాండ్స్‌ ఖాళీగా ఉండటానికి కారణం అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments