వన్డే వరల్డ్ కప్: వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దు చేస్తే.. విజేత ఎవరు?

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు భారత్ ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగితే ఫలితాన్ని ఎలా ప్రకటిస్తారు. విజేతగా ఏ టీమ్ ను ప్రకటిస్తారు. పూర్తి వివరాలు మీ కోసం..

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు భారత్ ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగితే ఫలితాన్ని ఎలా ప్రకటిస్తారు. విజేతగా ఏ టీమ్ ను ప్రకటిస్తారు. పూర్తి వివరాలు మీ కోసం..

ప్రపంచకప్ ఆరంభం నుంచి వరుసగా పది విజయాలను నమోదు చేసి రాయల్ గా ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది రోహిత్ సేన. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా వరల్డ్ కప్ లో అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టిస్తోంది. వరల్డ్ కప్ లో పాల్గొన్న అన్ని జట్లను అలవోకగా ఓడించి ఆల్ రెడీ విశ్వవిజేతగా నిలిచింది. కాగా రేపు (ఆదివారం) అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఆసిస్ తో ఢీకొనబోతోంది. అయితే ఈ మ్యాచ్ లో టైటిల్ నెగ్గేందుకు ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వేళ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు వర్షం పడితే పరిస్థితి ఏంటి? వర్షం కారణంగా ఫైనల్ రద్దైతే విజేత ఎవరు? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే వెల్లడించినట్లుగా, వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేలు ఉన్నాయి. కాబట్టి ఫైనల్ మ్యాచ్ జరగే ఆదివారంనాడు వర్షం పడి మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే రిజర్వ్ డేకి వాయిదా వేస్తారు. అనగా నవంబర్ 20 సోమవారం ఫైనల్ మ్యాచ్ మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో రిజర్వ్ డే రోజు ఆట పునఃప్రారంభించబడకపోతే, వర్షం కారణంగా లేదా మరేదైనా కారణంతో రద్దు చేయబడితే, భారత్ మరియు ఆస్ట్రేలియాలు 2023 ప్రపంచ కప్‌లో ఉమ్మడి విజేతలుగా ప్రకటించబడతాయి. అయితే వాతావరణ శాఖ సమాచారం ప్రకారం అహ్మదాబాద్ లో పొడి వాతావరణమే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీమిండియా కప్ గెలవాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. టీమిండియా గెలుపు కోసం పూజలు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

కాగా ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన కంగారులను కంగారు పెట్టించేందుకు రోహిత్ సేన సన్నద్ధమవుతోంది. కప్ గెలిచి తమ సత్తా ఏంటో చూపించడానికి టీమిండియా రెడీ అవుతోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్ కు దేశ ప్రధాని మోడీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని కూడా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం పకడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా పరమైన అంశాల్లో చర్యలు చేపడుతోంది అధికార యంత్రాంగం.

Show comments