Virender Sehwag, Rohit Sharma: వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఓటమి! రోహిత్‌ శర్మపై సెహ్వాగ్‌ ఘాటు విమర్శలు!

వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఓటమి! రోహిత్‌ శర్మపై సెహ్వాగ్‌ ఘాటు విమర్శలు!

వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఓటమి తర్వాత భారత జట్టుపై సర్వత్ర మద్దతు లభిస్తోంది. కప్పు రాకపోయినా.. మీరంతా ఛాంపియన్సే అంటూ క్రికెట్‌ అభిమానులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కానీ, సెహ్వాగ్‌ మాత్రం కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై విమర్శలు కురిపించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఓటమి తర్వాత భారత జట్టుపై సర్వత్ర మద్దతు లభిస్తోంది. కప్పు రాకపోయినా.. మీరంతా ఛాంపియన్సే అంటూ క్రికెట్‌ అభిమానులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కానీ, సెహ్వాగ్‌ మాత్రం కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై విమర్శలు కురిపించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కోట్ల మంది క్రికెట్‌ అభిమానుల ఆశలను అడియాశలను చూస్తూ.. టీమిండియా ఓటమి పాలైంది. ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టడమే కాకుండా.. 2003లో ఇదే ఆస్ట్రేలియాపై ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుని, 12 ఏళ్ల తర్వాత 2011 వరల్డ్‌ కప్‌ మధురక్షణాలను మళ్లీ అందిస్తుందనుకుంటే.. చివరి పోరులో భారత జట్టు చతికిలపడింది. ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్‌ వరకు దూసుకెళ్లిన రోహిత్‌ సేన.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో కంగారుల చేతిలో పరాజయం పొందింది. ఈ ఓటమితో యావత్‌ భారతదేశం నిరాశకు గురైంది. అస్సలు ఊహించని ఫలితంతో క్రికెట్‌ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ కష్ట సమయంలో అంతా భారత జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ, టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ మాత్రం.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై విమర్శలు గుప్పించాడు.

ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీ మొత్తం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ ఒక డిఫరెంట్‌ స్టైల్లో బ్యాటింగ్‌ చేశాడు. పవర్‌ ప్లేలో వేగంగా బ్యాటింగ్‌ చేసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని ఫిక్స్‌ అయి.. అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ చేశాడు. ఇంగ్లండ్‌ తో జరిగిన ఒక్క మ్యాచ్‌ ను మినహాయిస్తే.. మిగతా అన్ని మ్యాచ్‌ ల్లోనూ రోహిత్‌ శర్మ వేగంగానే ఆడాడు. రోహిత్‌ శర్మ అలా వేగంగా ఆడటం జట్టుకు ఎంతో బాగా కలిసొచ్చింది. పవర్‌ ప్లేలో భారీ రన్స్‌ రావడంతో పాటు.. తర్వాత వచ్చే బ్యాటర్లపై అసలు ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం దొరికింది. పైగా ప్రత్యర్థి టీమ్‌ లోని ప్రధాన బౌలర్లను టార్గెట్‌ చేసి రోహిత్‌ శర్మ కొట్టడంతో వారి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింది. ఇలా అగ్రెసివ్‌ గా ఆడే క్రమంలో రోహిత్‌ శర్మ సెంచరీలు, హాఫ్‌ సెంచరీలు కూడా మిస్‌ అయ్యాడు. ఇదే అగ్రెసివ్‌ ఇంటెంట్‌ ను రోహిత్‌ శర్మ ఫైనల్‌ లోనూ చూపించాడు.

అప్పటికే శుబ్‌మన్‌ గిల్‌ వికెట్‌ పడినా కూడా రోహిత్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బ్యాటింగ్‌ చేశాడు. మ్యాక్స్‌వెల్‌ ఓవర్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ కొట్టి.. తర్వాత బంతికి కూడా భారీ షాట్‌ ఆడే క్రమంలో ట్రావిస్‌ హెడ్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో అవుటయ్యాడు. అయితే.. ఫైనల్లో రోహిత్‌ శర్మ ఆడిన ఈ షాట్‌ పై సెహ్వాగ్‌ స్పందిస్తూ.. అదో చెత్త షాట్‌ గా పరిగణించాడు. అప్పటికే సిక్స్‌, ఫోర్‌ వచ్చిన తర్వాత మళ్లీ అలాంటి షాట్‌ ఆడాల్సిన అవసరం ఏముందని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ ఆ షాట్‌ కొట్టకపోయి ఉంటే.. కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేదని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. హిట్‌ మ్యాన్ అలా అవుట్‌ అవ్వడంతోనే టీమిండియా ఓటమి పాలైందనే ఉద్దేశం సెహ్వాగ్‌ వ్యాఖ్యల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనా.. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడి.. ఫైనల్లో భారత జట్టు ఓటమి పాలైన తీరుపై మాత్రం క్రికెట్‌ అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరి రోహిత్‌ శర్మపై సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments