భారత క్రికెటర్లకు అంత ఖర్మ పట్టలేదు! వాళ్లిచ్చే డబ్బు పార్టీ బిల్లుకు కూడా సరిపోదు: సెహ్వాగ్‌

Virender Sehwag, Adam Gilchrist: టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఆయన ఏమన్నారో ఎందుకన్నారో ఇప్పుడు చూద్దాం..

Virender Sehwag, Adam Gilchrist: టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఆయన ఏమన్నారో ఎందుకన్నారో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ నిత్యం ఏదో ఒక ఆసక్తికరమైన కామెంట్‌తో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా సెహ్వాగ్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. టీమిండియా ఆటగాళ్లకు అంత ఖర్మ పట్టలేదని, అలాగే వాళ్లు ఇచ్చే డబ్బు తన ఒక రాత్రి పార్టీ బిల్లుకు కూడా సరిపోదని అంటూ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇంతకీ సెహ్వాగ్‌ ఈ కామెంట్స్‌ ఎందుకు చేశాడు? ఎవరింటే డబ్బు తన ఒక రాత్రి పార్టీకి సరిపోదు అంటున్నాడు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం..

సెహ్వాగ్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌లో కలిసి ఓ చర్చలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్‌ మాట్లాడుతూ.. టీమిండియా ఆటగాళ్లు ఎప్పుడు విదేశీ లీగ్స్‌లో ఆడతారు? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా సెహ్వాగ్‌ స్పందిస్తూ.. ‘అసలు విదేశీ లీగ్స్‌లో ఆడాల్సిన ఖర్మ ఏంటి?, ఆ అవసరం టీమిండియా ఆటగాళ్లకు లేదు. ఇండియాలోనే వాళ్లకు కావాల్సినంత డబ్బు వస్తోంది. పైగా వేరే ఏ విదేశీ లీగ్స్‌లో కూడా టీమిండియా ఆటగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బు రాదు. అయినా.. పేద దేశాలకు వెళ్లి క్రికెట్‌ ఆడాల్సినంత గతి భారీ క్రికెటర్లకు పట్టేలేదు.’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

ఇంకా మాట్లాడుతూ.. తాను ఒక సారి టీమిండియాలో స్థానం కోల్పోయినప్పుడు బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి ఓ వ్యక్తి తనను సంప్రదించాడని, బిగ్‌ బాష్‌లో ఆడాల్సిందిగా అతనను నన్ను కోరాడు. అయితే.. తనకు ఎంత డబ్బు చెల్లిస్తారని అడిగాను.. దానికి అతను చెప్పిన సమాధానం నాకు నవ్వు తెప్పించింది. అతను నాకు రూ.84 లక్షలు ఇస్తా అని అన్నాడు. అంత డబ్బు నేను ఒక రాత్రి పార్టీ బిల్లు కింద కడతాను. నిన్న రాత్రి పార్టీ బిల్లు కూడా 84 లక్షలు అయిందంటూ సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. అయితే.. టీమిండియా ఆటగాళ్లు కూడా విదేశీ లీగ్స్‌లో ఆడాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. కానీ, బీసీసీఐ అందుకు అనుమతించడం లేదు. ఒక వేళ అనుమతించిన కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి ఆటగాళ్లు బిగ్‌బాష్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌, లంక ప్రీమియర్‌ లీగ్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌, కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లాంటి వాటిలో ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ఎందుకంటే ఆయా లీగ్స్‌లో ఆటగాళ్లకు చెల్లించే మొత్తం చాలా తక్కువ. మరి ఈ విషయంపై సెహ్వాగ్‌ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments