ప్రస్తుతం టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ ను చేజిక్కించుకున్న టీమిండియా.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడానికి సిద్దమైంది. కాగా.. తొలి రెండు వన్డేలకు సీనియర్లు అయిన విరాట్, రోహిత్ లకు విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు. రెస్ట్ తర్వాత మూడో వన్డే కోసం జట్టులో చేరారు ఈ స్టార్ ఆటగాళ్లు. రాజ్ కోట్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ లో కోహ్లీ శివతాండవం తప్పదు అంటున్నారు ఫ్యాన్స్. దానికి కారణం విరాట్ రికార్డులే నిదర్శణంగా నిలుస్తున్నాయి. మరి ఆ రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం.
ఆస్ట్రేలియాతో చివరిదైన మూడో వన్డే రాజ్ కోట్ వేదికగా జరగబోతోంది. టీమిండియా సిరీస్ నెగ్గడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఇక ఈ మ్యాచ్ తో తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ నుంచి ఆసీస్ బౌలర్లకు పెద్ద గండమే ఉందంటున్నాయి రికార్డులు. చివరి వన్డేలో ఆసీస్ బౌలర్లకు కోహ్లీ విశ్వరూపం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి నిదర్శనమే ఈ గణాంకాలు.
వన్డే సిరీస్ ల్లో 3వ మ్యాచ్ లో కోహ్లీకి ఉన్న బ్యాటింగ్ రికార్డు వరల్డ్ క్రికెట్ లో మరే ఇతర ఆటగాడికీ లేదు. ఇప్పటి వరకు వన్డే సిరీస్ ల్లో కోహ్లీ ఆడిన మూడవ మ్యాచ్ లో 67.80 సగటుతో 2,579 పరుగులు చేశాడు ఈ రన్ మెషిన్. ఇందులో 9 సెంచరీలు, 15 అర్దశతకాలు ఉన్నాయి. ఈ రికార్డులు చూస్తేనే అర్దం అవుతోంది.. ఆసీస్ తో జరిగే మూడో మ్యాచ్ లో కోహ్లీ శివతాండవం చేస్తాడని ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. బుధవారం(సెప్టెంబర్ 27) జరిగే ఈ మ్యాచ్ లో కోహ్లీ ఏ విధంగా చెలరేగుతాడో చూడాలి మరి.
Virat Kohli in the 3rd match of an ODI series:
Runs – 2,579.
Average – 67.80.
Hundreds – 9.
Fifties – 15.– Most runs by any player in history….!!! pic.twitter.com/EMPv4KNPgn
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 26, 2023