Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫ్యామిలీతో కలసి లండన్ వీధుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫ్యామిలీతో కలసి లండన్ వీధుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
Nidhan
క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే యువతకు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కోహ్లీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు ఏ స్థాయికి చేరుకున్నాడో తెలిసిందే. అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో కష్టాలు పడిన ఈ బ్యాటర్.. భారత్‌కు ఆడాలనే డ్రీమ్‌ను నెరవేర్చుకునేందుకు అహర్నిషలు శ్రమించాడు. టీమిండియాలోకి వచ్చాక కూడా ప్రతి ఏటా తనను తాను మెరుగుపర్చుకుంటూ నంబర్ వన్ ప్లేయర్‌గా ఎదిగాడు. ఫిట్నెస్, బ్యాటింగ్ స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు బెటర్ చేసుకుంటూ అందర్నీ దాటేశాడు. అలాంటి కింగ్ తన లైఫ్, కెరీర్లో ఎదుర్కొన్న పలు సవాళ్ల గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో షేర్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గెలుపోటములతో సంబంధం లేకుండా ఒకేలా ఉండాలి, ఒకే విధంగా శ్రమించాలనేది తాను పాటించే సూత్రం అని అన్నాడు కోహ్లీ. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటానని.. అస్సలు ఆపనని తెలిపాడు. ‘విజయాల్లో కాదు.. అపజయాల్లో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం? ఆ ఫేజ్‌ను యాక్సెప్ట్ చేసి ఎలా అధిగమిస్తానేది చాలా ముఖ్యం. ఫెయిల్యూర్ వెంట పడినప్పుడు, పని చేయాలని లేనప్పుడు, ప్రాక్టీస్‌పై ఇంట్రెస్ట్ పోయినప్పుడు దాని నుంచి ఎలా బయటపడతామనేది కీలకం. జీవితంలోని అన్ని దశల్ని గౌరవించాలి. బ్యాడ్ టైమ్ నడుస్తున్నా దానికి రెస్పెక్ట్ ఇచ్చి.. మన పని మనం చేయాలి. మనకు ఉండే బాధ్యతల్ని తప్పక నిర్వర్తించాలి’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
హార్డ్ వర్డ్ చేయడానికి సక్సెస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నాడు కోహ్లీ. విజయం వచ్చినా, పరాజయం పలకరించినా కష్టపడే తత్వంలో ఎలాంటి మార్పు రాకూడదని తెలిపాడు. అదే జీవితంలో అత్యంత కఠినమైన సవాల్ అని పేర్కొన్నాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడని.. ఆ దశను గౌరవించాలన్నాడు. నిత్యం శ్రమిస్తూ గెలుపోటములతో సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటూ పోతే సక్సెస్ అదే వస్తుందన్నాడు టీమిండియా స్టార్. తాను లైఫ్‌ను ఇలాగే చూస్తానన్నాడు. దేవుడి పరీక్షలో ఓడిపోయామంటే దానర్థం వచ్చిన అవకాశానికి కృతజ్ఞతగా లేరని గ్రహించాలన్నాడు. ఇక, కోహ్లీ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు దొరికిన భారీ గ్యాప్‌ను లండన్‌లో ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేస్తున్నాడు. మరి.. సక్సెస్‌తో సంబంధం లేకుండా కష్టపడటం ఆపొద్దంటూ కోహ్లీ ఇచ్చిన సజెషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Champion mentality of Virat Kohli pic.twitter.com/nqDFZEZHtf
— ً (@Worshipkohli) August 15, 2024