మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆల్ టైమ్ రికార్డును అతడి గడ్డపైనే బద్దలు కొట్టాడు కింగ్ విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో అద్భుత శతకంతో చెలరేగాడు విరాట్.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆల్ టైమ్ రికార్డును అతడి గడ్డపైనే బద్దలు కొట్టాడు కింగ్ విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో అద్భుత శతకంతో చెలరేగాడు విరాట్.
అద్భుతం, అమోఘం, అఖండం.. ఈ పదాలు చాలవేమో టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీని పొగడడానికి. అంతలా అతడి ఆట సాగుతోంది. ఇక ఈ వరల్డ్ కప్ లో విరాట్ బ్యాటింగ్ నభూతో నభవిష్యతి. ఇప్పటికే కోహ్లీ ఈ ప్రపంచ కప్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. రికార్డుల రారాజు అన్న పేరును సార్థకం చేసుకున్నాడు. తాజాగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కానీ సచిన్ ఆల్ టైమ్ రికార్డు 49 సెంచరీల రికార్డును అతడి గడ్డపైనే బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్లో అద్భుత శతకం సాధించాడు విరాట్.
విరాట్ కోహ్లీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. చరిత్రలో ఎవ్వరూ ఊహించని ఘనతను తనపేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో 106 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్స్ తో 100 పరుగులు పూర్తి చేసుకుని.. సచిన్ గడ్డపై సచిన్ రికార్డునే బ్రేక్ చేశాడు. 49 సెంచరీల మాస్టర్ బ్లాస్టర్ శతకాల రికార్డును బ్రేక్ చేస్తూ.. 50వ సెంచరీని సాధించాడు విరాట్ కోహ్లీ. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు. తొలుత రోహిత్ శర్మ(47), గిల్(79 రిటైర్ట్ హర్ట్) పరుగులతో జట్టుకు గట్టి పునాది వేశారు. ఆ తర్వాత కోహ్లీ-శ్రేయస్ అయ్యర్ జోడీ కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలోనే సెంచరీ చేసి మంచి ఊపుమీదున్న కోహ్లీని 117 పరుగుల వద్ద సౌథీ ఔట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 83 రన్స్ తో సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. మరి సచిన్ గడ్డపై సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
50TH ODI CENTURY BY KING KOHLI…!!!
The history has been rewritten at the den of Sachin Tendulkar. The king has surpassed God. pic.twitter.com/JsarDesKXX
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023