సచిన్‌, ధోని, ద్రావిడ్‌.. ప్రపంచంలో ఎవరివల్లా కాలేదు! కోహ్లీ సాధించాడు

టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు మరే క్రికెటర్‌ సాధించలేని ఘనత అందుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడుతున్న కోహ్లీ.. అరుదైన రికార్డు నెలకొల్పాడు. అయితే కోహ్లీ కంటే ముందు ఇలాంటి ఘనత సాధించే అవకాశం క్రికెట్‌ ప్రపంచంలో హేమాహేమీలకు వచ్చింది. కానీ వాళ్లెవరరూ ఆ రికార్డు సాధించలేకపోయాడు. క్రికెట్‌ చరిత్రలో తొలిసారి అలాంటి అరుదైన ఘనతను కోహ్లీ సాధించాడు.

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌.. కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ అనే విషయం తెలిసిందే. ఈ ప్రత్యేకమైన మ్యాచ్‌ను కోహ్లీ మరింత ప్రత్యేకంగా మార్చేసుకున్నాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన క్రికెటర్లలో ఇప్పటి వరకు ఎవరూ కూడా హాఫ్‌ సెంచరీ సాధించలేదు. కానీ, కోహ్లీ ఆ రిక్డారును అందుకున్నాడు. అయితే.. ఈ రికార్డును మరింత పటిష్టం చేస్తూ.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 87 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. రెండో రోజు ఆటలో మరో 13 రన్స్‌ చేస్తే, 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

అయితే.. కోహ్లీ కంటే ముందు 500 అంతర్జాతీయ మ్యాచ్‌లను 9 మంది దిగ్గజ క్రికెటర్లు పూర్తి చేసుకున్నారు. వారు వరుసగా.. సచిన్‌ టెండూల్కర్‌, మహేల జయవర్దనే, కుమార సంగార్కర, జయసూర్య, రికీ పాంటింగ్‌, ఎంఎస్‌ ధోని, షాహిద్‌ అఫ్రిదీ, జాక్వెస్‌ కల్లీస్‌, రాహుల్‌ ద్రావిడ్‌. వీరంతా 500లకి పైగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు. కానీ, 500వ మార్క్‌ అందుకున్న మ్యాచ్‌లో కనీసం ఫిఫ్టీ కూడా చేయలేదు. అలా 500వ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. మరి కోహ్లీ సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 21 ఏళ్లుగా ఇండియాపై గెలుపు లేదు! అయినా వారిదే పైచేయి

Show comments