Virat Kohli: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! కెప్టెన్ గా విరాట్ కోహ్లీ?

Virat Kohli: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! కెప్టెన్ గా విరాట్ కోహ్లీ?

వరల్డ్ కప్ విన్నింగ్ తర్వాత టీ20లకు గుడ్ బై చెప్పాడు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు. అయితే నిరాశలో ఉన్న కోహ్లీ అభిమానులకు ఓ గుడ్ న్యూస్.. త్వరలోనే విరాట్ ను కెప్టెన్ గా చూడబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

వరల్డ్ కప్ విన్నింగ్ తర్వాత టీ20లకు గుడ్ బై చెప్పాడు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు. అయితే నిరాశలో ఉన్న కోహ్లీ అభిమానులకు ఓ గుడ్ న్యూస్.. త్వరలోనే విరాట్ ను కెప్టెన్ గా చూడబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ ను ఎంపికచేసే పనిలో పడింది మేనేజ్ మెంట్. రేసులో హార్దిక్ పాండ్యా, శుబ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ లతో పాటుగా సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ పేరు తెరపైకి వచ్చింది. దాంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే అది టీమిండియాకు కాదులెండి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా రన్ మెషిన్, రికార్డుల రారాజు, కింగ్ విరాట్ కోహ్లీని మరోసారి కెప్టెన్ గా చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అది టీమిండియాకు కాదు.. ఐపీఎల్ లో. అవును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 17 సంవత్సరాలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీ గతంలో సారథిగానూ వ్యవహరించాడు. అప్పుడు జట్టును అద్భుతంగా ముందుండి నడపడంలో విజయవంతం అయ్యాడు. దాంతో మరోసారి కోహ్లీకి జట్టు పగ్గాలు అందించాలని ఆర్సీబీ మేనేజ్ మెంట్ భావిస్తోందట. అయితే ఇందుకు గల కారణాలు లేకపోలేదు. గతంలో ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యహరించినప్పుడు అదే సమయంలో టీమిండియా టీ20 కెప్టెన్ గానూ కోహ్లీ ఉన్నాడు. దాంతో ఒత్తిడి కారణంగా ఐపీఎల్ కెప్టెన్ గా దిగిపోయాడు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఎలాంటి బాధ్యతల్లో లేడు. పైగా గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న డుప్లెసిస్ కు 39 ఏళ్లు కావడం.. వచ్చే ఏడాదికి ఏజ్ పెరిగిపోవడంతో.. అతడిని సారథిగా కొనసాగించే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. దాంతో ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీని సారథిగా చూస్తామని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఐపీఎల్ 2016 సీజన్ లో ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్న కోహ్లీ.. ఆ సంవత్సరం జట్టును టోర్నీ ఫైనల్ కు చేర్చాడు. మరో మూడు సార్లు ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. దాంతో సారథిగా ఘనమైన రికార్డు కూడా విరాట్ కు ఉండటంతో.. వచ్చే సీజన్ కు అతడికే పగ్గాలు అప్పగించాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది. మరి విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్ అవ్వాలని ఎంత మంది కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments