ఫొటోలు దిగి షో చేశారు.. సపోర్ట్‌ చేయలేదు! సంచలన విషయాలు బయటపెట్టిన వినేష్‌ ఫొగాట్‌

Vinesh Phogat, PT Usha: పారిస్‌ ఒలింపిక్స్‌లో 100 గ్రాములు అధిక బరువు ఉందనే కారణంతో మెడల్‌ను కోల్పోయిన వినేష్‌ ఫొగాట్‌ తాజాగా ఐఓఏ ఛైర్‌పర్సన్‌పై విమర్శలు చేసింది. మరి ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..

Vinesh Phogat, PT Usha: పారిస్‌ ఒలింపిక్స్‌లో 100 గ్రాములు అధిక బరువు ఉందనే కారణంతో మెడల్‌ను కోల్పోయిన వినేష్‌ ఫొగాట్‌ తాజాగా ఐఓఏ ఛైర్‌పర్సన్‌పై విమర్శలు చేసింది. మరి ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..

ఇటీవలె ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌ 2024తో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ పేరు బాగా చర్చల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ పోటీల్లో ఫైనల్‌కు వెళ్లిన తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె నిలిచింది. కానీ, దురదృష్టవశాత్తు.. ఫైనల్‌ కంటే ముందు ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందని ఆమెను డిస్‌క్వాలిఫై చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. ఫైనల్‌కు చేరడంతో ఇండియాకు మెడల్‌ గ్యారెంటీ అనుకున్న సమయంలో.. డిస్‌క్వాలిఫై కావడంతో ఏ మెడల్‌ లేకుండా ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే.. తాను రాజకీయాలను బలయ్యాయని తాజాగా వినేష్‌ ఫొగాట్‌ సంచలన ఆరోపణలు చేసింది. తాను ఆస్పత్రిలో ఉంటే.. తనతో ఫొటోలు దిగి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి షో చేశారు కానీ, తనకు ఏ మాత్రం సపోర్ట్‌ అందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఫైనల్‌ మ్యాచ్‌ కంటే ముందు రోజు బరువు తగ్గేందుకు కఠిన వ్యాయామాలు చేయడం, శరీరం నుంచి రక్తం కూడా తీయించుకోవడంతో వినేష్‌ ఫొగాట్‌ తీవ్ర అనారోగ్యానికి గురై.. ఆస్పత్రి పాలైంది. ఆ సమయంలో భారత ఒలింపిక్స్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష.. ఆస్పత్రికి వెళ్లి వినేష్‌ను పరామర్శించారు. ఐఓఏ(ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌) వినేష్‌కు అండగా ఉందని పేర్కొన్నారు. కానీ, తాను అనార్యోగ్యంతో ఆస్పత్రిలో ఉంటే వచ్చి.. తనకు తెలియకుండా ఫొటోలు తీసుకొని.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని, కానీ, తనకు ఎలాంటి సపోర్ట్‌ అందించలేదంటూ సంచలన ఆరోపణలు చేసింది. పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన వినేష్‌ ఫొగాట్‌ ఇటీవలె రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించింది.

ఈ క్రమంలోనే తనకు పారిస్‌లో జరిగిన అన్యాయం గురించి మాట్లాడింది వినేష్‌. రాజకీయాలు అన్ని చోట్లా ఉంటాయని, పారిస్‌లో కూడా పాలిటిక్స్‌ నడియాని, తాను ఆ పాలిటిక్స్‌కే బలైనట్లు వెల్లడించింది. ఫొటోలు తీసుకొని.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి.. సపోర్ట్‌గా ఉన్నట్లు షో చేశారు కానీ, నిజానికి ఎలాంటి సపోర్ట్‌ అందించలేదంటూ విమర్శలు గుప్పించింది. మరి ఈ విషయంలో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉష ఏమని స్పందిస్తారో చూడాలి. కాగా, పారిస్‌ ఒలింపిక్స్‌ కంటే ముందు ఆల్‌ఇండియా రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ నిరసనకు దిగిన రెజ్లర్లలో వినేస్‌ ఫొగాట్‌ కూడా ఉన్న విషయం తెలిసిందే. మరి తాజాగా వినేష్‌ చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments