SNP
ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. టీమిండియా కూడా అద్భుతంగా రాణిస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే.. ఈ అండర్ 19 జట్టులో ఓ కత్తిలాంటి కుర్రాడు ఉన్నాడు. అతనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. టీమిండియా కూడా అద్భుతంగా రాణిస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే.. ఈ అండర్ 19 జట్టులో ఓ కత్తిలాంటి కుర్రాడు ఉన్నాడు. అతనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ప్రస్తుతం టీమిండియాలో యువ క్రికెటర్లకు చోటు దక్కడం కష్టంగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లను వదిలేస్తే.. మిగతా స్థానాలకు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్న వారు కూడా.. జట్టులో స్థానంలో సుస్థిరం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొత్త ఆటగాళ్లకు చోటు దక్కడం కష్టంగా మారింది. కానీ, టీ20 టీమ్‌లో మాత్రం కుర్రాళ్లకు చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పైగా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ 2024 ఉన్న నేపథ్యంలో భారత టీ20 జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా మంది కుర్రాళ్లు పోటీ పడుతున్నారు.
అయితే ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ జరుగుతున్న క్రమంలో భారత కుర్రాళ్లు ఎలా ఆడుతున్నారనే విషయంపై క్రికెట్ నిపుణులు ఒక కన్నేసి ఉన్నారు. అయితే.. వారి కళ్లలో ఓ కుర్రాడు పడ్డాడు. అతన్ని సరిగ్గా సానబెట్టి వాడుకుంటే.. మాత్రం టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌లా మారుతాడని చాలా ధీమాగా చెబుతున్నారు. అయితే.. క్రికెట్ నిపుణుల కళ్లలో పడిన ఆ యువ క్రికెటర్ ఎవరూ.. ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియా తరఫున అదరగొడుతున్న ఆ కుర్రాడి పేరు సౌమి పాండే. ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్.. వరల్డ్ కప్‌లో వికెట్ల పంట పండిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 9.5 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐర్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 10 ఓవర్లలో కేవలం 19 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇలా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 4,3,4 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన కనబర్చాడు. ఇలాంటి యువ బౌలర్‌ను తీసుకుని.. సరిగ్గా సానబెట్టి.. టీ20 వరల్డ్ కప్ 2024లో ఒక మిస్టరీ స్పిన్నర్‌లా దింపితే.. కప్పు మనదే అంటున్నారు క్రికెట్ నిపుణులు మరి ఈ సౌమి పాండే బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.