IND vs ENG: బ్యాటింగ్‌కు దిగకుండానే ఇంగ్లండ్‌కు ఫ్రీగా 5 రన్స్‌! అశ్విన్‌ చేసిన పనితో..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇంకా బ్యాటింగ్‌కు దిగకుండానే 5 పరుగులను ఉచితంగా పొందింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇంకా బ్యాటింగ్‌కు దిగకుండానే 5 పరుగులను ఉచితంగా పొందింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగానే.. ఇంగ్లండ్‌ జట్టుకు ఐదు పరుగులు ఉచితంగా లభించాయి. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క బాల్‌ పడకుండానే 5/0 స్కోర్‌తో బ్యాటింగ్‌ మొదలుపెట్టనుంది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అయితే.. ఇలా ఎందుకు ఇచ్చారు? కారణం ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.. క్రికెట్‌లో కొత్తగా వచ్చిన రూల్స్‌లో ఈ ఫైవ్‌ రన్స్‌ పెనాల్టీ ఒకటి. ఆటగాళ్లు చేసే తప్పులకు జరిమానాగా ప్రత్యర్థి టీమ్‌కు 5 పరుగులను ఉచితంగా అంపైర్లు కేటాయిస్తారు. బ్యాటర్‌ ఆడిన బాల్‌ వికెట్‌ కీపర్‌ తన వెనుక పెట్టుకున్న హెల్మెట్‌కు తగిలితే.. బ్యాటింగ్‌ టీమ్‌ ఐదు పరుగులు అదనంగా లభిస్తాయి. గ్రౌండ్‌లో హెల్మెట్‌ పెట్టినందుకు ఫీల్డింగ్‌ టీమ్‌కు అది పెనాల్టీ.

అలాగే బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. బ్యాటర్లు పరుగులు తీసే సమయంలో.. పిచ్‌లో డేంజర్‌ జోన్‌పై పరిగెడితే.. అంపైర్లు ఒకటికి రెండు సార్లు వార్నింగ్‌ ఇచ్చి.. ఆ తర్వాత పెనాల్టీ విధిస్తారు. పిచ్‌లో డేంజర్‌ జోన్‌ అంటే బాల్‌ పడే ప్లేస్‌. ఆ ప్లేస్‌లో పరిగెత్తడానికి ఆటగాళ్లకు అనుమతి ఉండదు. బౌలర్‌ కూడా ఫాలో త్రూలో ఆ జోన్‌లో అడుగులు వేయకూడదు. అలాంటిది.. టీమిండియా ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆ డేంజర్‌లోనే పరిగెత్తాడు.

దాంతో అంపైర్‌ అశ్విన్‌కు ఈ విషయంపై హెచ్చరించినా.. అలాగే చేయడంతో ఇంగ్లండ్‌కు 5 పరుగులు ఇస్తూ.. ఇండియాకు పెనాల్టీ వేశాడు. ఈ ఘటన ఆట రెండో రోజు 102వ ఓవర్‌లో చోటు చేసుకుంది. రెహాన్‌ అహ్మద్‌ వేసిన ఆ ఓవర్‌ మూడో బంతికి అశ్విన్‌ డేంజర్‌ జోన్‌లో పరిగెత్తడంతో అంపైర్‌ పెనాల్టీ విధించాడు. ఈ విషయంపై అశ్విన్‌, అంపైర్‌తో వాదనకు దిగినా.. ఫలితం లేకపోయింది. అయితే.. ఆ సమయంలో ఇండియా బ్యాటింగ్‌ చేస్తుండటంతో.. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ మొదలు పెట్టే టైమ్‌లో వారికి ఈ రన్స్‌ యాడ్‌ కానున్నాయి. దీంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 5/0తో స్టార్‌ చేయనుంది. మరి ఈ 5 రన్స్‌ పెనాల్టీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments