IND vs PAK: ఆ ఒక్కటి జరిగితే.. ఈ ఆదివారం ఇండియా vs పాకిస్థాన్‌ ఫైనల్‌?

ఇండియా-పాకిస్థాన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది కేవలం క్రికెట్‌ మ్యాచ్‌ మాత్రమే కాదు.. రెండు దేశాల మధ్య జరిగే భావోద్వేగాల యుద్ధం. అదే మ్యాచ్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ అయితే.. వామ్మో ఇంకేమైనా ఉందా? క్రికెట్‌ అభిమానులకు పండగే. మరి ఇండియా-పాక్‌ ఫైనల్‌ ఎప్పుడుంది? ఎక్కడ జరుగుతోంది? పూర్తి వివరాలు మీ కోసం..

ఇండియా-పాకిస్థాన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది కేవలం క్రికెట్‌ మ్యాచ్‌ మాత్రమే కాదు.. రెండు దేశాల మధ్య జరిగే భావోద్వేగాల యుద్ధం. అదే మ్యాచ్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ అయితే.. వామ్మో ఇంకేమైనా ఉందా? క్రికెట్‌ అభిమానులకు పండగే. మరి ఇండియా-పాక్‌ ఫైనల్‌ ఎప్పుడుంది? ఎక్కడ జరుగుతోంది? పూర్తి వివరాలు మీ కోసం..

ఇండియా- పాకిస్థాన్ ఈ రెండు దేశాల మధ్య ఉండే పోరు అన్నీ రంగాల్లో కామన్. కానీ.., క్రికెట్ లో మాత్రం ఒక యుద్ధాన్నే తలపిస్తుంది. ఇండియా-పాక్ మ్యాచ్‌ ఉందంటే రెండు దేశాల్లో పనులన్నీ ఆగిపోతాయి. చిన్నా, పెద్దా, ఆడా, మగా అనే తేడా లేకుండా అందరూ టీవీలకి అతుక్కుపోతారు. ఇక ఆ మ్యాచ్ వరల్డ్ కప్ లో భాగంగా జరిగేది అయితే.. ఆ హీట్ హైఓల్టేజ్ లెవల్ కి వెళ్ళిపోతుంది. అయితే.., ఈ ఆదివారం ఇలాంటి మ్యాచ్ జరిగే ఆస్కారం కనిపిస్తుంది. చదువుతుంటేనే కిక్ వస్తుంది కదూ..! ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అయితే.., ఇది అండర్-19 జట్ల మధ్య.

ప్రస్తుతం సౌతాఫ్రికా వేదికగా అండర్-19 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో టీమిండియా వరుస విజయాలు సాధించి ఏకంగా ఫైనల్ కి చేరుకుంది. ఈ మంగళవారం జరిగిన సెమీస్ లో ఆతిథ్య జట్టైనా సౌత్ ఆఫ్రికాని మట్టి కరిపించి భారత కుర్రాళ్ళు ఫైనల్ చేరడం విశేషం. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్స్ కోల్పోయి 244 పరుగులు సాధించింది. ఆ జట్టు ఓపెనర్ లువాన్-డ్రే ప్రిటోరియస్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రిచర్డ్ సెలెట్స్వేన్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేకపోయారు. ఇక భారత కుర్రాళ్లలో రాజ్ లింబాని 3 వికెట్స్ సాధించగా, ముషీర్ ఖాన్ రెండు వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంత కష్టసాధ్యమైన టార్గెట్ కానప్పటికీ.. ఛేదనలో ఇండియాకి శుభారంభం లభించలేదు. 32 పరుగులకే 4 వికెట్స్ కోల్పోయి ఇండియా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆ సమయంలో కెప్టెన్ ఉదయ్ శర్మ, మిడిల్ ఆర్డర్ ప్లేయర్ సచిన్ దాస్ సంయమనంతో బ్యాటింగ్ చేసి.., స్కోర్ బోర్డుని ముందుకి కదిలించారు.

క్రీజ్ లో కుదురుకున్నాక వేగం పెంచిన టీమిండియా కుర్రాళ్ళు.. ఐదో వికెట్ కి ఏకంగా 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. చివరికి మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఇండియా టార్గెట్ రీచ్ అయ్యి, సగర్వంగా ఫైనల్స్ లో అడుగు పెట్టింది. అయితే.. ఈ గురువారం మరో సెమీ ఫైనల్‌ ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరగబోతుంది. ఒకవేళ ఈ పోరులో గనుక పాక్ విజయం సాధిస్తే.., ఇండియా-పాక్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది. పాక్ ని ఓడిస్తే వచ్చే మజా వేరు కాబట్టి.., ఆస్ట్రేలియాపై పాక్ గెలిచి, మనతో ఫైనల్ పోరుకి ప్రత్యర్థిగా రావాలని ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి.., పాక్ ని ఫైనల్స్ ఓడిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments