Virat Kohli: వాంఖడేలో కోహ్లీ విక్టరీ స్పీచ్.. రోహిత్​ది, తనది ఒక్కటే కోరిక అంటూ..!

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశంలో ల్యాండ్ అయిన టీమిండియా.. ప్రధాని నరేంద్ర మోడీని కలిశాక ముంబైకి పయనమైంది. ఆ తర్వాత విక్టరీ పరేడ్​లో పాల్గొన్న భారత ఆటగాళ్లు అది ముగించుకొని వాంఖడేకు చేరుకున్నారు.

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశంలో ల్యాండ్ అయిన టీమిండియా.. ప్రధాని నరేంద్ర మోడీని కలిశాక ముంబైకి పయనమైంది. ఆ తర్వాత విక్టరీ పరేడ్​లో పాల్గొన్న భారత ఆటగాళ్లు అది ముగించుకొని వాంఖడేకు చేరుకున్నారు.

టీ20 వరల్డ్ కప్​ ట్రోఫీతో ముంబైలోకి ల్యాండ్ అయిన టీమిండియాకు గ్రాండ్ వెల్​కమ్ లభించింది. భారత జట్టు వస్తుందని తెలుసుకున్న అభిమానులు వేలాదిగా మహా నగరానికి చేరుకున్నారు. ఎయిర్​పోర్ట్, వాంఖడే స్టేడియం, బస్ స్టేషన్, మెట్రో, రైల్వే స్టేషన్.. ఇలా ఎక్కడ చూసినా అభిమానుల రద్దీనే కనిపించింది. ఎయిర్​పోర్ట్​లో రోహిత్ సేనకు ఘనస్వాగతం చెప్పిన ఫ్యాన్స్.. ఆ తర్వాత కూడా వాళ్లను ఫాలో అయ్యారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ బస్​లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. బస్సులో నుంచి భారత ఆటగాళ్లు అభిమానులకు అభివాదం చేశారు. కప్పు చేతబట్టి విజయగర్జన చేశారు. వాళ్లకు అడుగడుగునా ఫ్యాన్స్ నీరాజనాలు పలికారు. భారత్ మాతా కీ జై అంటూ స్లోగన్స్ ఇచ్చారు.

టీమిండియాను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా గుమిగూడటంతో ముంబై వీధులు, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. ఎయిర్​పోర్ట్ నుంచి వాంఖడే మైదానానికి వెళ్లే రోడ్ ట్రాఫిక్​తో స్తంభించిపోయింది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఆటగాళ్ల కోసం తడుస్తూ అలాగే ఎదురుచూశారు అభిమానులు. వరల్డ్ కప్ హీరోస్​ను దగ్గర నుంచి చూసి సంతోషంలో మునిగిపోవాలని అనుకున్నారు. వాళ్ల వెయిటింగ్​కు ఫుల్​స్టాప్ పెడుతూ కొద్ది సేపట్లోనే రోహిత్ సేన విక్టరీ పరేడ్ మొదలైంది. ఫ్యాన్స్​కు అభివాదం చేస్తూ వాంఖడే స్టేడియానికి చేరుకుంది మెన్ ఇన్ బ్లూ. అక్కడ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత మాట్లాడాడు. తమ జట్టు చాలా స్పెషల్ అని, ఇలాంటి టీమ్​ను సారథిగా ముందుండి నడిపించడం తన అదృష్టమని తెలిపాడు హిట్​మ్యాన్.

రోహిత్ తర్వాత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విక్టరీ స్పీచ్ ఇచ్చాడు. మెగాటోర్నీలో భారత్ మ్యాచుల్లో వెనుకబడిన ప్రతిసారి జస్​ప్రీత్ బుమ్రానే జట్టును తిరిగి గేమ్​లోకి తీసుకొచ్చాడని మెచ్చుకున్నాడు. బుమ్రా బౌలింగ్ అద్భుతమని ప్రశంసల్లో ముంచెత్తాడు. అలాంటోడు తరానికి ఒకడే వస్తాడని, అతడు మన టీమ్​లో ఉండటం లక్కీ అని చెప్పాడు విరాట్. రోహిత్​తో కలసి తాను 15 ఏళ్లుగా ఆడుతున్నానని, అతడ్ని ఇంత ఎమోషనల్​గా చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అని పేర్కొన్నాడు. కప్పు గెలిచాక అతడు ఏడుస్తూ కౌగిలించుకోవడం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు కోహ్లీ. ఆ రోజును మర్చిపోలేనని వివరించాడు. టీమిండియాకు కప్పు అందించాలని రోహిత్​తో కలసి ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్నానని.. ఇప్పుడు నెరవేరిందన్నాడు. ప్రపంచ కప్ గెలవడం తమ ఇద్దరి డ్రీమ్ అని వ్యాఖ్యానించాడు. వాంఖడేకు ట్రోఫీని తీసుకురావడం చాలా స్పెషల్ ఫీలింగ్ అంటూ స్పీచ్​ను ముగించాడు కోహ్లీ.

Show comments