BJPలో చేరిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా..!

Ravindra Jadeja: క్రీజులో ప్రత్యర్థులను చెమటలు పట్టించే రవీంద్ర జడేజా కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలియజేసింది ఈ క్రికెటర్ సతీమణి రివాబా.

Ravindra Jadeja: క్రీజులో ప్రత్యర్థులను చెమటలు పట్టించే రవీంద్ర జడేజా కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలియజేసింది ఈ క్రికెటర్ సతీమణి రివాబా.

టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు తన బౌలింగ్‌తో క్రీజులో ప్రత్యర్థులకు చెమలు పట్టించిన ఆయన ఇప్పుడు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఈ స్పిన్ బౌలర్ బీజెపీలోకి చేరాడు. జడేజా సతీమణి, బీజెపీ ఎమ్మెల్యే రివాబా సోలంకి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తనతో పాటు భర్త రవీంద్ర జడేజా బీజెపీలో సభ్యత్వ నమోదు కార్డు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జడేజా భార్య బీజెపీ ఎమ్మెల్యే అన్న విషయం విదితమే. రివాబా 2019లో బీజెపీలో చేరారు. పార్టీ బలోపేతానికి విశేషమైన కృషి చేయడంతో 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్టానం ఆమెకు ఉత్తర జామ్ నగర్ అసెంబ్లీ సీటును కేటాయించింది అధిష్టానం. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఇక జడేజా కెరీర్ విషయానికి వస్తే.. గుజరాత్ కు చెందిన జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఇండియన్ క్రికెటర్. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు జడ్డూ. తన బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌తో సత్తా చాటి ఆల్ రౌండర్‌గా మారి జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ఇప్పటి వరకు 72 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ 20 మ్యాచులు ఆడాడు. అత్యధికంగా టెస్టుల్లో 3036 పరుగులు తీశాడు ఈ లెఫ్ట్ హ్యాండ్స్ బ్యాట్స్ మన్. 294 వికెట్లు తీశాడు. ఇక వన్డేలో 2756 పరుగులు తీసిన ఈ ఆల్ రౌండర్.. 220 వికెట్లు తీశాడు. టీ 20లో 515 పరుగులు తీయగా.. 54 వికెట్లు కూల్చాడు. ఈ ఏడాది జరిగిన ఐసీసీ పురుషుల టీ20లో కూడా సత్తా చాటాడు.

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కప్ గెలిచాక అంతర్జాతీయ టీ20 ఫార్మాటు నుండి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. ఐపీఎల్‍లో కూడా పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున ఆడాడు. 2012- 2015 మధ్య.. ఆ తర్వాత 2018 నుండి ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ క్రికెటర్.. ఇప్పుడు బీజెపీ సభ్యత్వం తీసుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు.

Show comments