వీడియో: టీమిండియాకు వాటర్‌ సెల్యూట్‌! ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ చూసి ఉండరు!

Team India Victory Parade: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టుకు అరుదైన గౌరవం దక్కింది. ఇలాంటి దృశ్యాలు మీరెప్పుడూ చూసి ఉండరు.

Team India Victory Parade: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టుకు అరుదైన గౌరవం దక్కింది. ఇలాంటి దృశ్యాలు మీరెప్పుడూ చూసి ఉండరు.

టీ20 వరల్డ్ కప్​తో స్వదేశానికి చేరుకుంది భారత జట్టు. తుఫాను కారణంగా బార్బడోస్​లో చిక్కుకుపోయిన రోహిత్ సేన.. తిరిగి ఇక్కడికి చేరుకోవడం కాస్త లేట్ అయింది. అయితే ఆలస్యమైనా గానీ సెలబ్రేషన్స్ మాత్రం అదిరిపోయాయి. స్వదేశానికి వచ్చిన టీమిండియాకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు అభిమానులు. ఎయిర్​పోర్ట్​లో దిగిన క్షణం మొదలు జట్టు బస్సును ఫాలో అవుతూ తమ ప్రేమాభిమానాల్ని చూపిస్తున్నారు. ఢిల్లీలో ల్యాండ్ అయిన భారత ఆటగాళ్లు తొలుత ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో కలసి బ్రేక్​ఫాస్ట్ చేశారు. అనంతరం ముంబైకి పయనమయ్యారు. వాంఖడే స్టేడియంలో జరిగే సన్మాన కార్యక్రమానికి బయల్దేరారు.

వాంఖడే స్టేడియానికి చేరుకునే క్రమంలో భారత ఆటగాళ్లు ఓపెన్ బస్​లో విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అభిమానులు ముంబైకి చేరుకున్నారు. వరల్డ్ కప్ హీరోలను దగ్గర నుంచి చూసి పరవశంలో మునిగిపోవాలని అనుకుంటున్నారు. దీంతో ముంబైలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఆటగాళ్లను ఎయిర్​పోర్ట్​లో రివీస్ చేసుకోవాల్సిన బస్సు కూడా ట్రాఫిల్​లో చిక్కుకుంది. ఇదిలా ఉంటే.. ముంబైలో రోహిత్ సేనకు ఘన స్వాగతం లభించింది. మన జట్టు ఆటగాళ్లతో నిండిన ఫ్లైట్​ను వాటర్ సెల్యూట్​తో గౌరవించారు విమానాశ్రయ అధికారులు.

ఎయిర్​పోర్ట్​లో టీమిండియా ఫ్లైట్ ల్యాండ్ అవగానే రెండు వైపుల నుంచి ఫైర్ ట్రక్స్ నీళ్లను స్ప్రే చేస్తూ వాటర్ సెల్యూట్ చేశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చాలా అరుదుగా జరిగే వాటర్ సెల్యూట్ గురించి ఎక్కువ మందికి తెలియదు. దేశం కోసం ఏదైనా గొప్ప పని చేసినప్పుడు లేదా అరుదైన ఘనతను అందుకున్నప్పుడు లేదా అందర్నీ గర్వించేలా చేసినప్పుడు వాటర్ సెల్యూట్ చేస్తుంటారు. ఇది వరల్డ్ వైడ్​గా దాదాపుగా అందరూ పాటించే ట్రెడిషన్. దీన్నే టీమిండియా ఇవాళ అందుకుంది. దేశానికి కప్పు అందించిన ఆటగాళ్లు ప్రయాణించిన ఫ్లైట్ కావడంతో వాళ్లకు గౌరవ సూచకంగా వాటర్ సెల్యూట్ చేశారు అధికారులు. దీన్ని చూసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. భారత ఆటగాళ్లు ఈ గౌరవానికి వంద శాతం అర్హులని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. టీమిండియాకు వాటర్ సెల్యూట్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments