Suryakumar Yadav Says Will Miss Virat Kohli More: వాళ్లిద్దరిలో అతడ్ని బాగా మిస్ అవుతా.. చాలా విషయాలు నేర్పించాడు: సూర్యకుమార్

Suryakumar Yadav: వాళ్లిద్దరిలో అతడ్ని బాగా మిస్ అవుతా.. చాలా విషయాలు నేర్పించాడు: సూర్యకుమార్

టీ20 వరల్డ్ కప్-2024 టైటిల్​ను టీమిండియా సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. అద్భుతమైన క్యాచ్​తో ఫైనల్ మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడు.

టీ20 వరల్డ్ కప్-2024 టైటిల్​ను టీమిండియా సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. అద్భుతమైన క్యాచ్​తో ఫైనల్ మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడు.

టీ20 వరల్డ్ కప్-2024 విన్నింగ్ సెలబ్రేషన్స్ ఇంకా ముగియలేదు. కప్పుతో స్వదేశానికి చేరుకున్న టీమిండియా ప్లేయర్లను చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఎయిర్​పోర్టులో రోహిత్ సేనకు ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్.. ఆటగాళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నారు. కప్పు కల తీర్చిన హీరోలను దగ్గర నుంచి చూడాలని, వాళ్లతో కలసి భారత్ మాతా కీ జై అంటూ నినదించాలని కోరుకుంటున్నారు. స్వదేశానికి చేరుకున్న మెన్ ఇన్ బ్లూ ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లింది. అక్కడ పీఎం నరేంద్ర మోడీతో కలసి బ్రేక్​ఫాస్ట్ చేశారు భారత ఆటగాళ్లు. కప్పు విశేషాలను ఆయనతో పంచుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎయిర్​పోర్ట్​కు బయల్దేరారు. ఇవాళ సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లను సత్కరించనుంది బీసీసీఐ.

ఎయిర్​పోర్ట్ నుంచి వాంఖడే స్టేడియానికి ఓపెన్ బస్​లో రానున్నారు భారత ఆటగాళ్లు. ఈ విక్టరీ పరేడ్​లో వేలాది మంది అభిమానులు పాల్గొననున్నారు. ఒకవైపు గెలుపు సంబురాలు జరుగుతున్న టైమ్​లోనే మరోవైపు కప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన హీరోల గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. కోచింగ్ స్టాఫ్, ప్లేయర్లంతా కలసికట్టుగా రాణించడం వల్లే ఈ సక్సెస్ వచ్చిందని అంటున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లంతా పట్టుదలతో ఆడటం వల్లే కప్పు గెలిచామని చెబుతున్నారు. ఈ తరుణంలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇక మీదట డ్రెస్సింగ్ రూమ్​లో ఆ ఇద్దరు ప్లేయర్లను బాగా మిస్ అవుతానని అన్నాడు. సూర్య చెప్పిన వాళ్లిద్దరూ మరెవరో కాదు.. ఒకరు సారథి రోహిత్, మరొకరు కింగ్ విరాట్.

‘ఇక మీదట టీమిండియా డ్రెస్సింగ్ రూమ్​లో కోహ్లీ, రోహిత్​ను మిస్ అవుతా. ఇద్దరిలోనూ ముఖ్యంగా కోహ్లీని ఎక్కువగా మిస్‌ అవుతా. అతడో అద్భుతం. ప్రెజర్​ను ఎలా తట్టుకోవడంతో పాటు అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఎప్పుడైతే టీమ్ కష్టాల్లో ఉంటుందో అప్పుడు అతడు తనలోని బెస్ట్ బయటకు తీస్తాడు. అతడు బ్యాటింగ్​లో రాణించకపోతే ఫీల్డింగ్​లో అదరగొడతాడు. అతడో కరెంట్ తీగ లాంటోడు. ప్రతి పరుగును కాపాడాలని తాపత్రయపడతాడు. ప్రతి క్యాచ్​ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అలాంటి కోహ్లీని ఇక మీదట చాలా మిస్ అవుతా. అతడితో పాటు రోహిత్ కూడా ఇకపై డ్రెస్సింగ్ రూమ్​లో ఉండడనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది. ఇది మా అందరికీ ఎమోషనల్ మూమెంట్’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.

Show comments