SA vs BAN: అంపైర్ తప్పుతో ఓడిపోయిన బంగ్లాదేశ్! ఆ ఒక్క బాల్ వాళ్ల ఓటమికి కారణం..

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా కేవలం 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లా గెలవాల్సింది. కానీ అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఆ టీమ్ ఓడిపోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే?

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా కేవలం 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లా గెలవాల్సింది. కానీ అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఆ టీమ్ ఓడిపోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే?

టీ20 ప్రపంచ కప్ 2024లో బౌలర్ల జోరు కోనసాగుతోంది. పిచ్ లు అనుకూలిస్తుండటంతో.. స్టార్ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెడుతున్నారు బౌలర్లు. ఇక వరల్డ్ కప్ లో మరో  లో స్కోరింగ్ మ్యాచ్ ప్రేక్షకులను అలరించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో ప్రోటీస్ టీమ్ కేవలం 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవాల్సింది. కానీ అంపైర్ చేసిన తప్పునకు ఆ  టీమ్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ ఒక్క బాల్ బంగ్లా ఓటమిని శాసించింది.

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీమ్.. తంజిన్ హసన్(3/18), తస్కిన్ అహ్మద్(2/19) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులే చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో క్లాసెన్(46), మిల్లర్(29) పరుగులతో రాణించారు. అనంతరం 114 పరుగుల ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ను కేశవ్ మహరాజ్(3/27), రబాడ(2/19), నోకియా(2/17) దెబ్బతీశారు. దాంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులకే పరిమితం అయ్యి.. 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. తౌహిద్ హృదోయ్(37) టాప్ స్కోరర్ గా నిలవగా.. మహ్మదుల్లా(20) రన్స్ చేశాడు.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవాల్సిందని, కానీ అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగానే ఆ టీమ్ ఓడిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే? ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేయడానికి వచ్చాడు సౌతాఫ్రికా సీమర్ రబాడ. అప్పటికి బంగ్లా విజయానికి 18 బంతుల్లో 20 పరుగులు కావాలి. క్రీజ్ లో కుదురుకున్న హృదోయ్,  మహ్మదుల్లా ఉన్నారు. అయితే ఈ ఓవర్ తొలి బంతికే హృదోయ్ దురదృష్టవశాత్తు ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. అయితే అంతకు ముందు బార్ట్ మన్ వేసిన 17వ ఓవర్‌ రెండో బంతిని మహ్మదుల్లా షాట్‌కు యత్నించగా అది ప్యాడ్లకు తగిలి ఫైన్ లెగ్ మీదుగా బౌండరీకి వెళ్లింది. సౌతాఫ్రికా ఎల్బీడబ్ల్యూగా అపీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు.

కానీ మహ్మదుల్లా రివ్యూకి వెళ్లాడు, రివ్యూలో నాటౌట్ అని తేలింది. కానీ బంగ్లా స్కోరు బోర్డులో 4 పరుగులు జత కాలేదు. దానికి కారణం ఏంటంటే.. అంపైర్ తొలుత ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చి, ఆ తర్వాత రివ్యూలో నాటౌట్ అని తేలితే, దాన్ని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. బ్యాటింగ్ చేసే జట్టుకు ఎలాంటి స్కోరు ఇవ్వరు. ఇదే బంగ్లా కొంపముంచింది. పైగా అంపైర్ ఈ మ్యాచ్ లో ఇవ్వాల్సిన రెండు వైడ్లు కూడా ఇవ్వలేదని, రాంగ్ డెసిషన్ తో తనను ఔట్ గా ప్రకటించాడని మ్యాచ్ అనంతరం హృదోయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. డెడ్ బాల్ రూల్ కారణంగానే బంగ్లాకు 6 పరుగులు ఇవ్వకపోవడంతో ఆ జట్టు ఓడిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగానే బంగ్లాదేశ్ ఓడిపోయిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments