T20 World Cup: నమీబియాపై భారీ విజయం.. చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నమీబియాపై భారీ విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ క్రమంలోనే తన పేరిట పలు రికార్డులను నెలకొల్పింది. మరి ఆసీస్ సృష్టించిన రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నమీబియాపై భారీ విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ క్రమంలోనే తన పేరిట పలు రికార్డులను నెలకొల్పింది. మరి ఆసీస్ సృష్టించిన రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా బుధవారం అంటిగ్వా వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్ లో భారీ విజయం సాధించి.. మూడు విజయాలతో సూపర్ 8కి అర్హత సాధించింది. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా ఆసీస్ బౌలర్ల ధాటికి 17 ఓవర్లలో 72 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. అనంతరం 73 పరుగుల స్వల్ప టార్గెట్ ను కేవలం 5.4 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపోయి దంచికొట్టింది. మరి ఈ మ్యాచ్ లో ఆసీస్ సాధించిన ఘనత ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పసికూన నమీబియా ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా(4/12) దాటికి బెంబేలెత్తిపోయింది. అతడికి తోడు హేజిల్ వుడ్, స్టోయినిస్ తలా రెండు వికెట్లు తీయడంతో.. 17 ఓవర్లలో 72 రన్స్ కు నమీబియా ఆలౌట్ అయ్యింది. ఆ టీమ్ లో కెప్టెన్ హెరాస్మస్(36) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం 73 పరుగుల ఈజీ టార్గెట్ ను కేవలం 5.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి దంచికొట్టింది ఆసీస్.  ట్రావిస్ హెడ్ (34 నాటౌట్; 17 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (20; 8 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), మిచెల్ మార్ష్ (18 నాటౌట్, 9 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.

ఇక ఈ విజయంతో పలు రికార్డులు బద్దలు కొట్టింది ఆస్ట్రేలియా. అవేంటంటే? టీ20 వరల్డ్ కప్ లో బంతుల పరంగా భారీ విజయం సాధించిన రెండో జట్టుగా ఆసీస్ నిలిచింది. ఈ మ్యాచ్ లో 86 బాల్స్ మిగిలుండగానే కంగారూ టీమ్ విజయం సాధించింది. ఇక ఈ జాబితాలో శ్రీలంక తొలి స్థానంలో కొనసాగుతోంది. లంక 2014 టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై 90 బంతులు మిగిలుండగానే గెలిచి, రికార్డు క్రియేట్ చేసింది. దీంతో పాటుగా మరో ఘనత కూడా తన పేరిట లిఖించుకుంది ఆసీస్. పవర్ ప్లేలో ప్రత్యర్థిపై అత్యధిక ఆధిక్యాన్ని సాధించిన టీమ్ గా ఆసీస్ నిలిచింది. ఈ మ్యాచ్ లో నమీబియా పవర్ ప్లేలో 17/3తో నిలిస్తే.. కంగారూ టీమ్ ఏకంగా 74/1తో నిలిచింది. దాంతో ప్రత్యర్థి స్కోర్ కంటే 57 రన్స్ ఎక్కువ సాధించింది ఘనతకెక్కింది. మరి వరుస విజయాలతో పాటుగా రికార్డులు బద్దలు కొడుతున్న ఆసీస్ టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments