ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకోలేదు! సూర్యకుమార్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Suryakumar Yadav, Devisha Shetty: టీమిండియా స్టార​ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భార్య దేవీషా శెట్టి తాజాగా భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. మరి ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Suryakumar Yadav, Devisha Shetty: టీమిండియా స్టార​ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భార్య దేవీషా శెట్టి తాజాగా భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. మరి ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, టీ20 కెప్టెన్‌, మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భార్య దేవీషా శెట్టి ఆ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన భర్త సూర్యకుమార్‌తో కలిసి దిగే ఫొటోస్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటుంది. అయితే.. తాజాగా తన భర్త సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియా టీ20 కెప్టెన్‌గా నియామకం కావడంతో ఆమె భావోద్వేగపూరిత ఇన్‌స్టా స్టోరీ పెట్టింది. ఇలాంటి ఒక రోజు వస్తుందని తాము అనుకోలేదంటూ పేర్కొంది.

సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియాకు ఎంపికైనప్పుడు ఇలాంటి ఒక రోజు వస్తుందని మేము అనుకోలేదు. కానీ దేవుడు గొప్పవాడు. ప్రతి ఒక్కరి కష్టానికి కచ్చితంగా ఫలితం దక్కేలా చేస్తాడంటూ స్టోరీ చెప్పుకొచ్చింది. అయితే.. రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ తర్వాత ఖాళీ అయిన భారత టీ20 జట్టు కెప్టెన్సీ పోస్టును భర్తీ చేసేందుకు బీసీసీఐ చాలా కసరత్తు చేసింది. తొలుత టీ20 జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్‌ పాండ్యాకే టీ20 కెప్టెన్సీ పగ్గాలు దక్కుతాయని అంతా అనుకున్నారు.

కానీ, బీసీసీఐ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. అలాగే పాండ్యాకు ఉన్న వైస్‌ కెప్టెన్సీని పీకేసి.. ఆ పోస్టును యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు ఇచ్చింది. టీ20 కెప్టెన్సీ దక్కడంపై సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. టీ20 కెప్టెన్‌గా ఈ కొత్త రూల్‌ తనకు మరింత బాధ్యతను పెంచిందంటూ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో సూర్యకు ఈ అవకాశం వచ్చింది. కాగా, వన్డే, టెస్టుల్లో రోహిత్‌ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. మరి టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్య ఎంపికతో పాటు, అతని భార్య శెట్టి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments