Nidhan
Suryakumar Yadav To Captain Mumbai Indians: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడికి ఝలక్ ఇచ్చిందని వినిపిస్తోంది. అతడి ప్లేస్‌లో మరో టీమిండియా స్టార్‌ను కెప్టెన్‌గా నియమించాలని డిసైడ్ అయిందని టాక్ నడుస్తోంది.
Suryakumar Yadav To Captain Mumbai Indians: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడికి ఝలక్ ఇచ్చిందని వినిపిస్తోంది. అతడి ప్లేస్‌లో మరో టీమిండియా స్టార్‌ను కెప్టెన్‌గా నియమించాలని డిసైడ్ అయిందని టాక్ నడుస్తోంది.
Nidhan
ఐపీఎల్-2025కు ఇంకా చాలా సమయం ఉంది. ఈ సీజన్‌కు ముందు నిర్వహించే మెగా ఆక్షన్ కూడా ఇప్పట్లో లేదు. ఈ ఏడాది ఆఖర్లో జరగనుంది వేలం. అయితే ఇప్పటి నుంచే టీమ్స్ అన్నీ ఆక్షన్‌లో ఏయే ప్లేయర్లను తీసుకోవాలి? ప్రస్తుతం జట్టులో ఉన్న వారిలో ఎవర్ని వదులుకోవాలి అంటూ మార్పులపై ఫోకస్ పెట్టాయి. కొన్ని టీమ్స్ కెప్టెన్స్‌ను ఛేంజ్ చేస్తుండగా.. మరికొన్ని కోచ్‌లకు గుడ్‌బై చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పాపులర్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కూడా కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తమ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ ఇచ్చిందని సమాచారం. అతడ్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పిచేందుకు రంగం సిద్ధం చేసిందట. పాండ్యా ప్లేస్‌లో మరో టీమిండియా స్టార్‌ను కెప్టెన్‌గా నియమించాలని ఎంఐ డిసైడ్ అయిందని టాక్ నడుస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
హార్దిక్ పాండ్యా స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తోందట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ఊపందుకున్నాయని తెలుస్తోంది. ఒకవేళ సూర్య టీమ్‌ను వీడి మెగా ఆక్షన్‌లో పాల్గొనాలని డిసైడ్ అయితే మరో సీనియర్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రాకు సారథ్య పగ్గాలు అప్పగించాలని ఎంఐ ఓనర్స్ అనుకుంటున్నారట. కెప్టెన్సీ విషయంపై ఇప్పటికే హార్దిక్‌కు క్లారిటీ ఇచ్చేశారని.. ఇక మీదట అతడు ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగుతాడని వినిపిస్తోంది. హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తీసేయడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా సక్సెస్ అయిన హార్దిక్‌ను గతేడాది మినీ ఆక్షన్‌లో టీమ్‌లోకి తీసుకొచ్చింది ముంబై. భారీ ధర పెట్టి అతడ్ని సొంతం చేసుకుంది. జీటీలాగే ఎంఐని కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తాడని గంపెడాశలు పెట్టుకుంది. అయితే హార్దిక్ విఫలమయ్యాడు. అటు బ్యాటర్‌గా, బౌలర్‌గా ఫెయిల్ అవడమే గాక చెత్త కెప్టెన్సీతోనూ విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో అతడ్ని ఆ పోస్ట్‌లో నుంచి తీసేయాలని ఎంఐ ఓనర్స్ ఫిక్స్ అయ్యారట. గుజరాత్ నుంచి ఎంఐకి వచ్చిన హార్దిక్ కాంట్రాక్ట్ కూడా ఒక ఏడాదేనని అంటున్నారు. అందుకే అతడ్ని కెప్టెన్సీ నుంచి తీసేసి సూర్యకు ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట. ఒకవేళ ఇదే జరిగితే పాండ్యా ఆ అవమానాన్ని ఎలా తట్టుకుంటాడో చూడాలి. అయితే కెప్టెన్సీ మార్పు మీద ఇప్పటివరకు ముంబై ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. మరి.. ఎంఐకి ఎవరు కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.