SNP
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా.. సౌతాఫ్రికాలో జరిగే ఎస్‌ఏ20లో మాత్రం సన్‌రైజర్స్ స్టార్ టీమ్. తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచిన ఆ జట్టు.. తాజాగా ముంబైపై సంచలన విజయం సాధించింది. ఆ విజయంతో ఓనర్ కావ్య మారన్ ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా.. సౌతాఫ్రికాలో జరిగే ఎస్‌ఏ20లో మాత్రం సన్‌రైజర్స్ స్టార్ టీమ్. తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచిన ఆ జట్టు.. తాజాగా ముంబైపై సంచలన విజయం సాధించింది. ఆ విజయంతో ఓనర్ కావ్య మారన్ ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఉండే సపోర్ట్స్ కంటే కూడా ఆ జట్టు ఓనర్ కావ్య మారన్‌కు ఉండే ఫ్యాన్ బేస్ ఎక్కువ. మ్యాచ్ చూస్తూ ఆమె ఇచ్చే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలామంది మీమ్స్ చేస్తుంటారు. అవి కూడా రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. అయితే కావ్య ఆశించే స్థాయిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన చేయకపోవడంతో.. కావ్య డల్‌గా ఉన్న ఫొటోలే వైరల్ అయ్యేవి. కానీ, చాలాకాలం తర్వాత విజయోత్సాహంతో కావ్య మారన్ గెత్తులేసింది. సంతోషం పట్టలేక చిన్న పిల్లలా థ్రిల్లింగ్ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సీన్స్.. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్‌ఏ20 లీగ్‌లో చోటు చేసుకుంది. మంగళవారం ఎంఐ కేప్‌టౌన్-సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి బాల్ వరకు వెళ్లి నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది.
దాదాపు గెలుపు అసాధ్యం అనుకున్న మ్యాచ్‌ను ఎంఐ బ్యాటర్లు చివరి బాల్ వరకు తీసుకొచ్చారు. ఈ మ్యాచ్ మాత్రం క్రికెట్ అభిమానులకు ఫుల్ పైసా వసూల్ మ్యాచ్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 202 పరుగులు భారీ స్కోర్ చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో జోద్రాన్ హీర్‌మన్ 62 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 106 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. మరో ఓపెనర్ డేవిడ్ మలాన్ సైతం హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 53 పరుగులు చేసి రాణించాడు. మలాన్ అవుటైన తర్వాత జోద్రాన్ మరింత రెచ్చిపోయి ఆడాడు. ఎంఐ బౌలర్లు హెండ్రిక్స్, లివింగ్‌స్టోన్, సామ్ కరన్, ఓల్లీ స్టోన్ ఇలా అందరిని చితక్కొట్టాడు. చివర్లలో కెప్టెన్ మార్కరమ్ 13 బంతుల్లో 19 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. యువ క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్ 11 రన్స్‌చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఇక 203 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఎంఐ.. ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్లు వాన్ డర్ డసెన్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు, ర్యాన్ రిక్కిల్టన్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 58 రన్స్ చేసి సూపర్ స్టార్ట్ ఇచ్చారు. కానీ, తర్వాత సన్‌రైజర్స్ బౌలర్లు పుంజుకుని వికెట్లు పడగొట్టడంతో ఎంపీ టార్గెట్ ఛేజింగ్‌తో స్లో అయింది. చివర్లలో పొలార్డ్, సామ్ కరన్ చెలరేగడంతో ఇక్వెషన్స్ మారిపోయాయి. 7 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన దశలో సామ్ కరన్ భారీ సిక్స్ బాదాడు. దీంతో చివరి ఓవర్‌లో కేవలం 15 రన్స్ కావాలి. తొలి బంతికే మరో భారీ సిక్స్. ఇక 5 బంతుల్లో 9 పరుగులు.. దీంతో మ్యాచ్ ఎంపీదే అనుకున్నారంతా.. కానీ, బౌలర్ ఒట్నీల్ బార్ట్‌మాన్ సన్‌రైజర్స్‌ను గెలిపించాడు. తర్వాతి 5 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి.. సన్‌రైజర్స్‌ను 4 రన్స్ తేడాతో విజయతీరాలకు చేర్చాడు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించడంతో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ స్టాండ్స్‌లో మాస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ మ్యాచ్ తర్వాత కావ్య చేసుకున్న సెలబ్రేషన్స్ వైరల్‌గా మారాయి. మరి ఈ మ్యాచ్ జరిగిన తీరు, అలాగే కావ్య సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.