ఆ స్టార్ ప్లేయర్​తో పోల్చుకోను.. కానీ నాకు నమ్మకం ఉంది: నితీష్ రెడ్డి

సన్​రైజర్స్ యంగ్ సెన్సేషన్ నితీష్​ రెడ్డి ఈ ఏడాది ఐపీఎల్​లో అదరగొట్టాడు. విధ్వంసక బ్యాటింగ్​తో ప్రత్యర్థి జట్లను భయపెట్టాడు. అలాంటోడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సన్​రైజర్స్ యంగ్ సెన్సేషన్ నితీష్​ రెడ్డి ఈ ఏడాది ఐపీఎల్​లో అదరగొట్టాడు. విధ్వంసక బ్యాటింగ్​తో ప్రత్యర్థి జట్లను భయపెట్టాడు. అలాంటోడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

పేరుకే తెలుగు జట్టు.. అందులో తెలుగువాళ్లే లేరంటూ విమర్శించారు. లోకల్ ప్లేయర్లను ఆడించనప్పుడు ఇంకా ఆ ఫ్రాంచైజీ ఎందుకంటూ ట్రోల్ చేశారు. ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు, ఇంటర్నేషనల్ ప్లేయర్లతో టీమ్​ను నింపేశారని.. జట్టులో స్థానికులకు అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టారు. ఇదంతా సన్​రైజర్స్ హైదరాబాద్ గురించే. ఇరు తెలుగు రాష్ట్రాల అభిమానుల మద్దతుతో ఐపీఎల్​లో అదరగొడుతోంది ఎస్​ఆర్​హెచ్​. అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ జట్టు విషయంలో ఒక కంప్లయింట్ బాగా వస్తుండేది. అదే లోకల్ ప్లేవర్ మిస్సవడం. అయితే ఈ సీజన్​తో అది కూడా పూర్తైంది. తెలుగు కుర్రాడు నితీష్​ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది టీమ్ మేనేజ్​మెంట్. అతడు దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. విధ్వంసక బ్యాటింగ్​తో ఆడియెన్స్ హృదయాలు దోచుకున్నాడు.

ఈ సీజన్​లో ఆడిన 13 మ్యాచుల్లో 303 పరుగులు చేశాడు నితీష్​ రెడ్డి. బౌలింగ్​లోనూ రాణించి 3 వికెట్లు పడగొట్టాడు. అతడికి ఎక్కువగా బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. కెప్టెన్ కమిన్స్ తన చేతికి బాల్ ఇచ్చినప్పుడల్లా మాత్రం ప్రూవ్ చేసుకున్నాడు. ఒక మ్యాచ్​లో 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్​లో ఎస్​ఆర్​హెచ్ ఫైనల్స్​కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు నితీష్. అందుకే అతడు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. టీమిండియాకు ఫ్యూచర్ ఆల్​రౌండర్​గా అతడ్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో నితీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ భారత స్టార్ ప్లేయర్​తో తనను తాను పోల్చుకోనని చెప్పాడు. కానీ తన మీద తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు.

‘టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాతో నన్ను నేను పోల్చుకోను. కానీ నా బ్యాటింగ్ ఎబిలిటీస్ మీద నాకు విశ్వాసం ఉంది. నేను బాగా బ్యాటింగ్ చేయగలనని తెలుసు. కానీ బౌలింగ్ విషయంలో మాత్రం అంత కాన్ఫిడెన్స్ లేదు. బౌలింగ్​లో నేను మరింత మెరుగవ్వాలి. పాండ్యా స్థాయికి చేరుకోవాలంటే నేను చాలా బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బౌలింగ్ చేస్తున్న స్పీడ్ కంటే ఇంకో 3 నుంచి 4 కిలోమీటర్లు అదనపు వేగంతో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు భారత జట్టు తరఫున బౌలర్​గా కూడా బరిలోకి దిగే సామర్థ్యం నాకు ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఆ దిశగా నేను మరింత కష్టపడాల్సి ఉంటుంది’ అని నితీష్ రెడ్డి చెప్పుకొచ్చాడు. మరి.. పాండ్యాలాగే నితీష్​ కూడా టీమిండియాకు ఆడగలడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

Show comments