Somesekhar
Sourav Ganguly Praised Rishabh Pant: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత దిగ్గజం సౌరవ్ గంగూలీ. అతడు టెస్ట్ క్రికెట్ ను ఏలుతాడు అంటూ కితాబిచ్చాడు.
Sourav Ganguly Praised Rishabh Pant: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత దిగ్గజం సౌరవ్ గంగూలీ. అతడు టెస్ట్ క్రికెట్ ను ఏలుతాడు అంటూ కితాబిచ్చాడు.
Somesekhar
టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య త్వరలోనే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కు బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. సుధీర్ఘ కాలం తర్వాత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజం సౌరవ్ గంగూలీ అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్ట్ క్రికెట్ లో అతడు భారత అత్యుత్తమ క్రికెటర్ గా ఎదుగుతాడని కితాబిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
రిషబ్ పంత్.. 2022లో కారు ప్రమాదానికి గురై, తీవ్రంగా శ్రమించి.. మళ్లీ బ్యాట్ పట్టుకున్నాడు. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంత్.. అద్భుతంగా రాణించాడు. ఇక టీ20 వరల్డ్ కప్ లో కూడా మంచి ప్రదర్శనే ఇచ్చాడు. దాంతో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ కు కూడా మేనేజ్ మెంట్ జట్టులోకి తీసుకుంది. ఇక ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇస్తూ.. అన్ని ఫార్మాట్స్ లో తిరిగి ఆడనున్నాడు. ప్రస్తుత జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా బి తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే బంగ్లాతో జరిగే టెస్ట్ మ్యాచ్ కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
“టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్ట్ జట్టులోకి తిరిగొచ్చినందుకు నాకు ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే? అతడు భారత టెస్టు క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నేను భావిస్తున్నాను. పంత్ టెస్టులు ఆడుతూనే ఉంటాడు. ఈ ఫార్మాట్ లో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT)’ క్రికెటర్ గా ఎదుగుతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే పంత్ అలా ఎదగాలంటే.. ఇలాగే తన ఫామ్ ను కొనసాగించాలి. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ లో తన గేమ్ ను ఇంకా మెరుగుపరుచుకోవాలి. అతడికున్న అపారమైన ప్రతిభతో గొప్ప ప్లేయర్ గా నిలుస్తాడు” అంటూ కితాబిచ్చాడు సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి కోసం ఎదురుచూస్తున్నానని, గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోకపోవడంతోనే అతడిని బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయలేదని భావిస్తున్నట్లు తెలిపాడు. ఆసీస్ తో సిరీస్ కు షమీ అందుబాటులోకి వస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి టీమిండియా టెస్ట్ క్రికెట్ ఫ్యూచర్ గోట్ రిషబ్ పంత్ అన్న గంగూలీ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
Sourav Ganguly believes Rishabh Pant is on course to become an all-time great in Test cricket 🙌#INDvsBAN #TeamIndia #SouravGanguly #RishabhPant #CricketTwitter pic.twitter.com/8zasbUJKEz
— InsideSport (@InsideSportIND) September 9, 2024