Shubman Gill: కోహ్లీ, రోహిత్ లను అధిగమించి.. దశాబ్ద కాలంలో ఒకే ఒక్కడిగా గిల్ రికార్డు!

Shubman Gill Smashed Most Centuries In This Decade: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లు సైతం సాధించలేని రికార్డును తన పేరిట లిఖించుకుని, ఈ దశాబ్దంలో ఒకే ఒక్క ఇండియన్ ప్లేయర్ గా శుబ్ మన్ గిల్ నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Shubman Gill Smashed Most Centuries In This Decade: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లు సైతం సాధించలేని రికార్డును తన పేరిట లిఖించుకుని, ఈ దశాబ్దంలో ఒకే ఒక్క ఇండియన్ ప్లేయర్ గా శుబ్ మన్ గిల్ నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన భారత జట్టు సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలకు సైతం దక్కని రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. దాంతో ఈ దశాబ్దంలో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క  ఇండియన్ బ్యాటర్ గా చరిత్రపుటల్లోకి ఎక్కాడు శుబ్ మన్ గిల్.

శుబ్ మన్ గిల్.. టీమిండియాలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అద్బుతమైన ఆటతీరుతో జట్టులో తన ప్లేస్ ను సుస్థిరం చేసుకున్నాడు. సీనియర్ ప్లేయర్లను సైతం వెనక్కి నెట్టి సూపర్ ఫామ్ తో భారత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను సైతం అతి పిన్న వయసులోనే సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో సెంచరీ చేయడం ద్వారా దిగ్గజాలు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సైతం సాధించలేని ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ దశాబ్దలో ఎక్కువ సెంచరీలు బాదిన ఇండియన్ క్రికెటర్ గా శుబ్ మన్ గిల్ నిలిచాడు.

శుబ్ మన్ గిల్ ఈ 10 సంవత్సరాల్లో 114 ఇన్నింగ్స్ ల్లో 12 ఇంటర్నేషనల్ సెంచరీలు బాదాడు. ఇక ఈ దశాబ్ద కాలంలో ఈ ఘనత సాధించిన ఇండియన్ ప్లేయర్ గా గిల్ రికార్డుల్లోకి ఎక్కాడు. శుబ్ మన్ తర్వాత ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఉన్నారు. విరాట్ 149 ఇన్నింగ్స్ ల్లో 10 సెంచరీలు బాదగా.. హిట్ మ్యాన్ 148 ఇన్నింగ్స్ లో పది శతకాలు కొట్టాడు. కాగా.. టీమిండియాలో గిల్ కంటే సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. అతి పిన్న వయసులోనే రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ దూసుకెళ్తున్నాడు ఈ యంగ్ ప్లేయర్. ఇక గిల్ కెరీర్ విషయానికి వస్తే.. 2019లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన గిల్.. 26 టెస్టుల్లో 1611, 47 వన్డేల్లో 2328, 21 టీ20ల్లో 578 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్స్ లో సెంచరీ సాధించిన ప్లేయర్ గా కూడా గిల్ రికార్డుల్లోకి ఎక్కాడు. మరి 25 ఏళ్లకే దిగ్గజాల రికార్డులను బద్దలు కొడుతూ.. ముందుకు సాగుతున్న శుబ్ మన్ గిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments