సూర్య తాత్కాలిక కెప్టెన్‌ మాత్రమే.. గంభీర్‌ కొత్త కెప్టెన్‌ వేటలో ఉన్నాడు: మాజీ క్రికెటర్‌​

Scott Styris, Suryakumar Yadav, Gautam Gambhir: భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎక్కువ రోజులు కెప్టెన్‌గా ఉండడంటూ ఓ మాజీ క్రికెటర్‌ బాంబు పేల్చాడు. ఈ స్టేట్‌మెంట్‌ గురించి ఇప్పుడుపూర్తి వివరాలు తెలుసుకుందాం..

Scott Styris, Suryakumar Yadav, Gautam Gambhir: భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎక్కువ రోజులు కెప్టెన్‌గా ఉండడంటూ ఓ మాజీ క్రికెటర్‌ బాంబు పేల్చాడు. ఈ స్టేట్‌మెంట్‌ గురించి ఇప్పుడుపూర్తి వివరాలు తెలుసుకుందాం..

శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు అదరగొడుతోంది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. మంగళవారం జరిగే చివరి మ్యాచ్‌ కూడా గెలిచి.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. టీ20 జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌కు ఇదే తొలి సిరీస్‌ అనే విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత రోహిత్‌ శర్మ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో సూర్యను భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ.

కానీ, సూర్యకుమార్‌ యాదవ్‌.. టీమిండియా లాంగ్‌టర్మ్‌ కెప్టెన్‌ కాదని, అతను షార్ట్‌టర్మ్‌ కెప్టెన్‌ మాత్రమే అంటూ న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్కాట్ స్టైరిస్ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఇంకా కొత్త కెప్టెన్‌ వేటలోనే ఉన్నట్లు స్టైరిస్‌ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2026 కోసం.. ఒక లాంగ్‌ టర్మ్‌ కెప్టెన్‌గా వేటలో గంభీర్‌ ఉన్నట్లు.. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడేంత వరకు మాత్రమే సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియాకు కెప్టెన్‌ ఉండాటని కివీస్‌ దిగ్గజం అభిప్రాయపడ్డాడు.

రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌తో టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ అనూహ్యంగా కెప్టెన్‌ అయ్యాడు నిజానికి.. రోహిత్‌ శర్మ వారసుడిగా హార్ధిక్‌ పాండ్యానే టీ20 కెప్టెన్‌ అవుతాడని అంతా భావించారు. ఎందుకంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌కు అతనే వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అందుకే అతనే కెప్టెన్‌ అవుతాడని అంతా భావించారు. కానీ, బీసీసీఐ అతనికున్న వైస్‌ కెప్టెన్సీ కూడా తీసేసి.. శుబ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌ చేసింది. భవిష్యత్తులో శుబ్‌మన్‌ గిల్‌ టీ20 కెప్టెన్‌ అవుతాడని, అప్పటి వరకు సూర్య షార్ట్‌ టర్మ్‌ టీ20 కెప్టెన్‌ ఉండాలని స్టైరిస్‌ ఉద్దేశంగా కనిపిస్తోంది. మరి అతని ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments