అలా ఆడటం రోహిత్‌కు రాదు! అందుకే కోహ్లీ కంటే వెనుకబడ్డాడు: పాక్‌ క్రికెటర్‌

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మ ఒత్తిడిలో ఆడలేడని అన్నాడు. అతను అలా ప్రెషర్‌ సిచ్యూవేషన్స్‌లో ఆడిన ఒక్క మ్యాచ్‌ కూడా లేదని అన్నాడు. నిజానికి అతను అలాంటి పరిస్థితుల్లో అస్సలు బ్యాటింగ్‌ చేయలేదు. అందుకే దాదాపు అతను ఆడిన అన్ని నాకౌట్‌ మ్యాచ్‌ల్లో విఫలం అయ్యాడని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ సల్మాన్‌ భట్‌ అన్నాడు. జట్టుకు ఎప్పుడైతే అతని అవసరం ఉంటుందో అప్పుడు రోహిత్‌ శర్మ విఫలం అవుతాడు. టీమ్‌కు అవసరమైనప్పుడు అతని ఆడి ఒక్క సూపర్‌ ఇన్నింగ్స్‌ కూడా ఉన్నట్లు నాకు గుర్తు లేదని పేర్కొన్నాడు. ఇదే విరాట్‌ కోహ్లీకి అతనికి ఉన్నా తేడా అని వెల్లడించాడు.

రోహిత్‌ శర్మ పెద్ద ప్లేయరేనని, దాన్ని తాను ఒప్పుకుంటానని కానీ, కోహ్లీ ఉన్న టాలెంట్‌ రోహిత్‌లో లేదన్నాడు. కాగా, 2014 నుంచి భారత్ బరిలోకి దిగిన అన్నీ ఐసీసీ టోర్నీల్లో ఆడిన రోహిత్ శర్మ నాకౌట్ మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 29 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 2015 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో 34 పరుగులు చేసి నిరాశపరిచాడు. ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో నంబర్‌ ఆటగాడు ఎవరంటే అంతా విరాట్‌ కోహ్లీ పేరే చెబుతారు. ఆ తర్వాత రోహిత్‌ శర్మ పేరు వినిపిస్తుంది. ఇదే పాయింట్‌పై మాట్లాడిన సల్మాన్‌.. రోహిత్‌కు ఒత్తిడి తట్టుకుని ఆడటం చేత కాదని తేల్చేశాడు. ఈ వ్యాఖ్యలపై రోహిత్‌ శర్మ అభిమానులు అతనిపై మండిపడుతున్నారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో డకౌట్ అయిన రోహిత్ శర్మ, 2019 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్‌ శర్మ కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో కొనసాగాడు. ఏకంగా ఆ వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఐదు సెంచరీలు బాదాడు. కానీ, ఏం లాభం.. కచ్చితంగా గెలవాల్సిన సెమీ ఫైనల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక్కడి నుంచే రోహిత్‌పై నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆడలేడనే ముద్ర పడింది. ఇక మరికొన్ని మ్యాచ్‌లు చూసుకుంటే.. 2021 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన రోహిత్ శర్మ, 2022 టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. సెమీ ఫైనల్లో 28 బంతుల్లో 27 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆసియా కప్ 2022 టోర్నీలోనూ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ 2021, 2023లోనూ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ గణంకాలను చూపిస్తూ.. సల్మాన్‌ భట్‌ రోహిత్‌ను ఒత్తిడిలో ఆడటేని ప్లేయర్‌గా అభివర్ణించాడు.

ఇదీ చదవండి: ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించడం అంటే ఇదేనేమో! 32 బంతుల్లోనే..

Show comments