Nidhan
Rohit Sharma, IND vs BAN: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ కసి మీద ఉన్నాడు. పరుగుల వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే సెకండ్ టెస్ట్‌లో దుమ్మురేపాలని అనుకుంటున్నాడు.
Rohit Sharma, IND vs BAN: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ కసి మీద ఉన్నాడు. పరుగుల వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే సెకండ్ టెస్ట్‌లో దుమ్మురేపాలని అనుకుంటున్నాడు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ కసి మీద ఉన్నాడు. పరుగుల వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. భారీ బౌండరీలు, సిక్సులతో బంగ్లాదేశ్ మీద విరుచుకుపడాలని చూస్తున్నాడు. ఆ జట్టుతో చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో హిట్‌మ్యాన్ ఫెయిల్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసిన భారత సారథి.. రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేశాడు. అయితే రెండో టెస్ట్‌కు ఆతిథ్యం ఇస్తున్న కాన్పూర్‌లో ఇది రిపీట్ అవ్వొద్దని కోరుకుంటున్నాడు. బిగ్ ఇన్నింగ్స్‌తో బంగ్లాకు మరింత పోయించాలని అనుకుంటున్నాడు. అయితే హిట్‌మ్యాన్‌కు అటు అపోజిషన్ టీమ్‌తో పాటు ఇటు కాన్పూర్ స్టేడియం నిర్వాహకులు కూడా భయపడుతున్నారు.
కాన్పూర్ స్టేడియానికి రోహిత్ భయం పట్టుకుంది. అతడు ఎక్కడ సిక్సులతో విరుచుకుపడతాడోనని స్టేడియం నిర్వాహకులు వణికిపోతున్నారు. దీనికి కారణం ఆ స్టేడియంలోని ఒక స్టాండ్ బలహీనంగా ఉండటమేనని తెలుస్తోంది. మూడేళ్ల తర్వాత ఈ గ్రౌండ్లో జరగనున్న తొలి టెస్ట్ ఇదే. ఇందులోని ఒక స్టాండ్ బలహీనంగా ఉందని ఉత్తర్‌ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చెప్పినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ స్టాండ్ ఫుల్ కెపాసిటీ మేరకు ఫ్యాన్స్ నిండితే కూలిపోయే ప్రమాదం ఉందని ఆఫీసర్స్ తెలిపినట్లు వినిపిస్తోంది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు బిగ్ సిక్సులు కొడితే అభిమానులు ఎగిరి గంతేస్తే ప్రేక్షకుల బరువును కూడా ఆ స్టాండ్ మోయలేదట. ఈ రీజన్ వల్లే సగం కంటే తక్కువగా టికెట్లు అమ్ముతున్నట్లు సమాచారం.
కాన్పూర్ స్టేడియం బాల్కనీ C సిచ్యువేషన్ ఆందోళనకరంగా ఉందని.. మ్యాచ్ టైమ్‌లో దాన్ని మూసివేయాలని యూపీ క్రికెట్ అసోసియేషన్‌ను ఇంజినీర్ల బృందం హెచ్చరించిందని సమాచారం. ఈ స్టాండ్‌కు వెంటనే మరమ్మతులు చేయాలని ఒక ఇంజినీర్ చెప్పినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక, కాన్పూర్ టెస్ట్‌లో సేమ్ టీమ్‌తో వెళ్లాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టులో ఎలాంటి ఛేంజెస్ చేయొద్దని అనుకుంటున్నట్లు వినిపిస్తోంది. అయితే ఇక్కడి వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తుంది కాబట్టి పేసర్ ఆకాశ్‌దీప్‌కు బదులు చైనామన్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. పిచ్‌ను పరిశీలించాకే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.