RCB కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ! క్లారిటీ ఇచ్చేసిన దినేష్‌ కార్తీక్‌

Rohit Sharma, IPL 2025, RCB, Dinesh Karthik: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో రోహిత్‌ శర్మ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌గా వస్తాడనే ఊహాగానాలపై ఆర్సీబీ ఆటగాడు డీకే స్పందించాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, IPL 2025, RCB, Dinesh Karthik: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో రోహిత్‌ శర్మ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌గా వస్తాడనే ఊహాగానాలపై ఆర్సీబీ ఆటగాడు డీకే స్పందించాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉన్నా.. వచ్చే సీజన్‌ గురించి రకరకాల ఊహాగానాలు, కీలక నిర్ణయాల గురించి రోజుకో అప్డేట్‌ వస్తోంది. వచ్చే సీజన్‌ కోసం బీసీసీఐ మెగా వేలం నిర్వహించనుంది. ఈ మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌ల విధివిధానాలపై ఇటీవలె బీసీసీఐ.. పది టీముల ఓనర్లతో మీటింగ్‌ నిర్వహించింది. ఈ సమావేశం తర్వాత.. ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌ విధానం ఖరారు అయినట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్‌ తర్వాత.. ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆ జట్టును వీడటం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలోనే దీనిపై గుసగుసలు వినిపించినా.. తాజాగా అవి మరింత బలపడ్డాయి.

ముంబై ఇండియన్స్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. రోహిత్‌ను కొనుగోలు చేయడానికి చాలా టీమ్స్‌ ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా ముందు వరుసలో ఉంది. ఐపీఎల్‌ మెగా వేలంలో రోహిత్‌ పాల్గొంటే అతని కోసం ఎన్ని కోట్లు అయినా పెట్టేందుకు ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై తాజాగా ఆర్సీబీ ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ కూడా స్పందించాడు. క్రిక్‌ బజ్‌లో.. ‘హేయ్‌ సీబీ ఆస్క్‌ డీకే’ అనే షోలోఓ.. నెటిజన్లు నుంచి ఎదురైన పలు ప్రశ్నలకు డీకే సమాధానం చెప్పాడు.

ఓ నెటిజన్‌.. రోహిత్‌ శర్మ ఆర్సీబీ కెప్టెన్‌గా వస్తే దానిపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగిన ప్రశ్నకు దినేష్‌ కార్తీక్‌ మౌనం వహించాడు. ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. డీకే ఇచ్చిన రియాక్షన్‌ను బట్టి.. రోహిత్‌ శర్మ ఆర్సీబీలోకి వస్తున్నాడంటూ ఫ్యాన్స్‌ ఫిక్స్‌ అయిపోతున్నారు. ఎందుకంటే.. కాదు అని చెప్పలేకే, ఆ విషయాన్ని లీక్‌ చేయడం ఇష్టం లేకే డీకే సైలెంట్‌ అయిపోయాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అయితే.. ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ తనతో సంప్రదించకుండా.. తన స్థానంలో హార్ధిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడంతో రోహిత్‌ హర్ట్‌ అయ్యాడు. అందుకే ఆ టీమ్‌ నుంచి బయటికి వచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన కెప్టెన్సీలో రోహిత్‌ ఎంఐకి ఏకంగా ఐదు కప్పులు అందించిన విషయం తెలిసిందే. వచ్చే సీజన్‌లో నిజంగానే రోహిత్‌ ఆర్సీబీకి కెప్టెన్‌గా ఆడితే.. ఆర్సీబీకి తొలి ఐపీఎల్‌ ట్రోఫీ రావడం ఖాయం అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్‌. మరి రోహిత్‌ ఆర్సీబీకి కెప్టెన్‌ అయితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments