టీమిండియా సెలక్షన్ కమిటీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Author Soma Sekhar Published - 09:03 PM, Thu - 10 August 23
  • Author Soma Sekhar Published - 09:03 PM, Thu - 10 August 23
టీమిండియా సెలక్షన్ కమిటీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

2023 వరల్డ్ కప్ కు మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. దీంతో ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది టీమిండియా. అందులో భాగంగానే ప్రయోగాల బాటపట్టింది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రయోగాలతో కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తోంది. కాగా.. విండీస్ పై వరుసగా రెండు టీ20 మ్యాచ్ లు ఓడిపోవడంతో.. టీమిండియా సెలక్షన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. వరల్డ్ కప్ ముంగిట ఇలాంటి ప్రయోగాలు ఏంటి? అంటూ మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు టీమిండియాపై, సెలక్షన్ కమిటీపై అలాగే కెప్టెన్ రోహిత్ శర్మపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. ఏ ఒక్క ప్లేయర్ ను ఆటోమెటిక్ గా సెలక్షన్ చేయరు అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు.

టీమిండియా సెలక్షన్ కమిటీపై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అదీకాక వరల్డ్ కప్ సమీపిస్తున్న క్రమంలో యువ క్రికెటర్లతో ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారు అంటూ మాజీలు మండిపడుతున్నారు. ఈ విమర్శలన్నింటికీ కౌంటర్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తాజాగా మీడియాతో ముచ్చటించిన రోహిత్.. ఈ ప్రశ్నలకు జవాబిచ్చాడు. “టీమిండియాలో ఏ ఒక్క ఆటగాడు ఆటోమెటిక్ గా ఎంపిక కాడు. అందుకు నేను కూడా మినహాయింపుకాదు. నన్ను కూడా అందరిలాగే సెలక్ట్ చేస్తారు. అదీకాక జట్టులో ఏ ఒక్కరి ప్లేస్ కు గ్యారంటీ లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక యంగ్ ప్లేయర్స్ కు ఎందుకు అవకాశాలు ఇస్తున్నరని ప్రశ్నించగా..”2023 ఆసియా కప్ కోసం కుర్రాళ్లను రెడీ చేస్తున్నాం. వారికి ఒత్తిడిలో ఎలా ఆడాలో ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నాం. అందులో భాగంగానే యంగ్ ప్లేయర్స్ కు అవకాశాలు ఇస్తున్నాం” అంటూ రోహిత్ శర్మ తెలిపాడు. మరి టీమిండియా సెలక్షన్ కమిటీపై వచ్చిన విమర్శలకు రోహిత్ శర్మ ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: BCCIపై ఫైర్ అయిన ఊతప్ప.. అన్యాయం చేస్తున్నారంటూ..!

Show comments