Rohit Sharma, World Cup 2023: సెమీస్‌కి ముందు.. టాస్‌ గురించి రోహిత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

సెమీస్‌కి ముందు.. టాస్‌ గురించి రోహిత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

న్యూజిలాండ్‌తో కీలకమైన సెమీ ఫైనల్‌కు టీమిండియా సిద్ధంగా ఉంది. అయితే.. మ్యాచ్‌ జరిగే ముంబైలోని వాంఖడే స్టేడియంలో టాస్‌ ఎంత కీలకమనే విషయంలో చాలా చర్చ జరుగుతోంది. దీనిపై భారత కెప్టెన్‌ రోహిత్‌ కూడా స్పందించాడు. అతను ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

న్యూజిలాండ్‌తో కీలకమైన సెమీ ఫైనల్‌కు టీమిండియా సిద్ధంగా ఉంది. అయితే.. మ్యాచ్‌ జరిగే ముంబైలోని వాంఖడే స్టేడియంలో టాస్‌ ఎంత కీలకమనే విషయంలో చాలా చర్చ జరుగుతోంది. దీనిపై భారత కెప్టెన్‌ రోహిత్‌ కూడా స్పందించాడు. అతను ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ వరల్డ్‌ కప్‌ 2023 సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ఈ మెగా పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్లు.. ఫైనల్‌ బెర్త్‌ కోసం జరిగి సమరానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఓటమి అనేదే ఎరుగని జట్టుగా టీమిండియా బరిలోకి దిగుతుండగా.. లీగ్‌ దశలో ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై.. టాప్‌ ఫోర్త్‌ టీమ్‌గా కివీస్‌ పోరుకు రెడీ అయింది. ఇప్పటికే ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే. అయినా కూడా కివీస్‌తో సెమీస్‌ అంటేనే భారత క్రికెట్‌ అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది.

2019 వన్డే వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌తోనే జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అలాగే పలు సందర్భాల్లో నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కూడా న్యూజిలాండ్‌దే పైచేయిగా ఉంది. కానీ, ఈ సారి టీమిండియా ఎంతో పటిష్టంగా ఉందని, న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది చాలా మంది గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే.. వాంఖడే స్టేడియంలో టాస్‌ గెలవడం చాలా కీలకం అనే వాదనలు వినిపిస్తున్నాయి. టాస్‌ గెలిచిన జట్టే మ్యాచ్‌ గెలిచే అవకాశం ఉందని కొంతమంది క్రికెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, మ్యాచ్‌కి ముందు జరిగిన మీడియా సమావేశంలో రోహిత్‌ శర్మ టాస్‌పై కూడా స్పందించాడు. తాను చిన్నప్పటి నుంచి ఇక్కడ క్రికెట్‌ ఆడుతున్నానని, టాస్‌ అనేది అసలు కీలకమే కాదని తేల్చేశాడు. మరి రోహిత్‌ టాస్‌ కీలక కాదని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments