విరాట్ తో అలాంటి విషయాలే మాట్లాడతా.. రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 07:00 PM, Fri - 8 September 23
  • Author Soma Sekhar Published - 07:00 PM, Fri - 8 September 23
విరాట్ తో అలాంటి విషయాలే మాట్లాడతా.. రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రస్తుతం టీమిండియా ముందు రెండు బిగ్ టోర్నీలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ కాగా.. ఇంకోటి తర్వలో జరగబోయే వన్డే ప్రపంచ కప్. ఇక ఆసియా కప్ లో సూపర్ 4లోకి వెళ్లింది టీమిండియా. కాగా.. ఇటీవలే వరల్డ్ కప్ లో పాల్గొనే జట్టును ప్రకటించింది బీసీసీఐ. దీంతో జట్టు సెలెక్షన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కేఎల్ రాహుల్ ను, వన్డేల్లో రాణించని సూర్యకుమార్ ను జట్టులోకి ఎందుకు తీసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ క్రికెటర్లు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి టెన్షన్ మెుదలైంది. టీమిండియా విమర్శల నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం దెబ్బతింటే ఇబ్బందులు తప్పవని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అలాంటి టెన్షన్ ఏమీ అక్కర్లేదని చెప్పుకొచ్చాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. అలాగే విరాట్ కోహ్లీతో తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడతాడో కూడా చెప్పుకొచ్చాడు రోహిత్.

వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించినప్పటి నుంచి జట్టు కూర్పుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ ఆటగాడిని ఎందుకు తీసుకున్నారు? ఈ ప్లేయర్ ను ఎందుకు పక్కన పెట్టారు? అంటూ మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం దెబ్బతింటుందని క్రీడా నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎలా ఉంటుందో? ఆటగాళ్లతో తాను ఏవిధంగా ఉంటాడో? విరాట్ కోహ్లీతో తాను క్రీజ్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారో చెప్పుకొచ్చాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ.

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ చాలా సరదగా ఉంటుందని రోహిత్ తెలిపాడు. ఆటగాళ్లందరితో కోచ్ రాహుల్ ద్రవిడ్ జోవియల్ గా ఉంటాడని, ప్లేయర్ల మధ్య ఏ మాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుంటాడని తెలిపాడు రోహిత్. విషయం ఏదైనా ముఖం ముందే చెప్పేయాలన్నది రాహుల్ నెంబర్ వన్ రూల్ అని రోహిత్ శర్మ తెలిపాడు. ఇక విరాట్ కోహ్లీతో తనకు ఉన్న అనుబంధం గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ నేను క్రీజ్ లో ఉన్నప్పుడు బౌలర్ ఎవరు? అతడిని ఎలా ఎదుర్కొవాలి? అని మాట్లాడుకుంటాం. అలాగే రాబోయే సిరీస్ లు, ఏ యంగ్ ప్లేయర్లపై కన్నేసి ఉంచాలి? అన్న విషయాలు ఎక్కువగా చర్చించుకుంటామని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Show comments