ఏ మాత్రం లెక్క చేయకుండా.. వాళ్ల పరువు తీస్తున్న రోహిత్‌ శర్మ!

Rohit Sharma, IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌ చాలా జోరుగా సాగుతోంది. ప్రధాన సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్లు ఈ సీజన్‌లో దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా రోహిత్‌ శర్మ గురించి మాట్లాడుకుంటే.. అతను కొంతమందిని అసలు లెక్క చేయడం లేదు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Rohit Sharma, IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌ చాలా జోరుగా సాగుతోంది. ప్రధాన సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్లు ఈ సీజన్‌లో దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా రోహిత్‌ శర్మ గురించి మాట్లాడుకుంటే.. అతను కొంతమందిని అసలు లెక్క చేయడం లేదు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మ​ంచి టచ్‌లోకి వచ్చేశాడు. పవర్‌ ప్లేలో పవర్‌ హిట్టింగ్‌తో అదరగొడుతున్న రోహిత్‌.. ముంబై ఇండియన్స్‌కి యువ క్రికెటర్‌ ఇషన్‌ కిషన్‌తో కలిసి అదిరిపోయే ఆరంభాలను అందిస్తున్నాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో 105 పరుగులు చేశాడు. ముఖ్యంగా పవర్‌ ప్లేలో రోహిత్‌ ఆడుతున్న ఎటాకింగ్‌ గేమ్‌కు ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి. ఎలాంటి బౌలర్‌ ఎదురుగా ఉన్నా, ఏ టీమ్‌తో మ్యాచ్‌ ఆడినా.. ఫస్ట్‌ బాల్‌ నుంచి రోహిత్‌ ఎటాక్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాను సున్నా మీద అవుటైనా, 49 వద్ద అవుటైనా రోహిత్‌ పెద్దగా బాధపడటం లేదు. పవర్‌ ప్లేలో తన టీమ్‌కు వీలైన్ని ఎక్కువ పరుగులు అందించానా లేదా అనే రోహిత్‌ ఆలోచిస్తున్నాడు.

ఈ క్రమంలోనే పేస్‌ బౌలర్లను రోహిత్‌ శర్మ అసలు ఏ మాత్రం లెక్కచేయడం లేదు. పవర్‌ ప్లేలో ఎక్కువగా పేస్‌ బౌలర్లే బౌలింగ్‌ చేస్తుంటారు. రోహిత్‌ శర్మ కూడా పవర్‌ ప్లేలోనే వీలైనంత వేగంగా ఆడుతున్నాడు. దీంతో.. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఫాస్ట్ బౌలర్లపై రోహిత్ శర్మ 95.5 యావరేజ్‌ కలిగి ఉన్నాడు. ఇది సాధారణమై విషయం కాదు. అలాగే ఫాస్ట్‌ బౌలర్లకు వ్యతిరేకంగా 173.6 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అయినా కూడా రోహిత్‌ శర్మ టీమ్‌ కోసం కాకుండా తన కోసం ఆడుతున్నాడంటూ.. స్వార్థంతో బ్యాటింగ్‌ చేస్తున్నాడంటూ కొంతమంది అర్థం లేని విమర్శలు చేస్తున్నారు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ 52.20 యావరేజ్‌, 167.31 స్ట్రైక్‌రేట్‌తో 261 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్‌ 105(నాటౌట్‌)గా ఉంది. మొత్తం 28 ఫోర్లు, 15 సిక్సులు బాదాడు. సాధారణంగా రోహిత్‌ స్పీడ్‌, స్పిన్‌ బౌలింగ్‌లోనూ బాగా ఆడగలడు. అయితే.. ఈ సీజన్‌లో మాత్రం రోహిత్‌ శర్మ పేస్‌ బౌలర్లంటే అసలు ఏ మాత్రం దయ లేకుండా ఆడుతున్నాడు. 95.5 సగటుతో బ్యాటింగ్‌ చేస్తున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు.. స్పీడ్‌ బౌలర్లపై రోహిత్‌ శర్మ దండయాత్ర ఏ రేంజ్‌లో సాగుతుందో. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments