వీడియో: కప్పు గెలిచిన ఆనందం.. డ్యాన్స్‌ ఇరగదీసిన రోహిత్‌! మీరు చూశారా?

Rohit Sharma Dancing, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌తో టీమిండియా స్వదేశానికి తిరిగిరావడంతో క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఖుషీగా ఉన్నారు. వారి సంతోషాన్ని మరింత పెంచేశాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma Dancing, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌తో టీమిండియా స్వదేశానికి తిరిగిరావడంతో క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఖుషీగా ఉన్నారు. వారి సంతోషాన్ని మరింత పెంచేశాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎక్కువగా గంభీరంగా ఉంటూ.. ఫీల్డ్‌లో చాలా భాగంగా సీరియస్‌గానే ఉంటాడు. ఆటగాళ్లు సరిగా ఫీల్డింగ్‌ చేయకపోయినా.. ప్లాన్‌కు అనుగుణంగా బౌలింగ్‌ వేయకపోయినా.. రోహిత్‌ శర్మ కోపాన్ని రుచిచూడాల్సిందే. అందుకే రోహిత్‌ శర్మ అంటే యువ క్రికెటర్లలో ఒక తెలియని భయం ఉంటుంది. అయితే.. ఒక్కసారి తాను అనుకున్నది సాధించిన తర్వాత.. రోహిత్‌ శర్మ కూడా చిన్నపిల్లాడు అయిపోయాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ తర్వాత నుంచి రోహిత్‌ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు.

అయితే.. ఇటీవల టీమిండియా వెస్టిండీస్‌ నుంచి ఇండియాకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిసిన తర్వాత.. ముంబైలో భారీ రోడ్‌ షోను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగి హోటల్‌కు చేరుకున్న తర్వాత.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ డ్యాన్స్‌తో అలరించాడు. రోహిత్‌ డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతని డ్యాన్స్‌కు సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది. క్రికెట్‌ అభిమానులు ఆ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు.

వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌లో టీమిండియా, సౌతాఫ్రికాను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. నిజానికి భారత జట్టు ఎప్పుడో ఇండియాకు తిరిగి రావాల్సింది. కానీ, వెస్టిండీస్‌లో హరికేన్‌ తుపాను కారణంగా.. భారీ వర్షంలు ఉండటంతో విమాన సర్వీసులు అన్ని రద్దు అయ్యాయి. దీంతో.. నాలుగు రోజుల పాటు భారత జట్టు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలించి.. రోహిత్‌ సేన ఇండియాకు తిరిగి వచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. మరి కప్పుతో వచ్చిన సందర్భంగా రోహిత్‌ వేసిన డ్యాన్స్‌ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments