SNP
Rohit Sharma, Virat Kohli: ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడంతో క్రికెట్ అభిమానులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. వారంతా ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? అసలు రోహిత్, కోహ్లీ టీ20 రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Virat Kohli: ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడంతో క్రికెట్ అభిమానులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. వారంతా ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? అసలు రోహిత్, కోహ్లీ టీ20 రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
SNP
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను 1-1తో డ్రా చేసిన తర్వాత.. ఇండియన్ క్రికెట్ అభిమానులను మరింత ఖుషీ చేసింది బీసీసీఐ. అదెలాగంటే.. ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో భారీ మార్పులు చేస్తూ.. ఎన్నో అనుమానాలకు, అయోమయాలకు పుల్‌స్టాప్ పెట్టింది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీలను మళ్లీ టీ20లకు తీసుకొచ్చింది. వన్డే వరల్డ్ కప్ 2023 కంటే చాలా కాలం ముందు వీరిద్దరు టీ20 క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను బ్యాలెన్స్ చేస్తూ.. వన్డేలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో.. రోహిత్-కోహ్లీ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. అయితే చాలా మంది ఇక వాళ్లు పూర్తిగా టీ20లకు దూరం అవుతారని భావించారు.
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ 2024 ఉండటంతో.. రోహిత్, కోహ్లీ టీ20 ఫ్యూచర్ ఏంటనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో వీరిద్దరికీ చోటు ఉంటుందా? లేదా అని కూడా క్రికెట్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. బీసీసీఐ మాత్రం ఈ సీనియర్ ప్రోస్‌పై నమ్మకం ఉంచి.. టీ20ల్లో కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే సిరీస్‌కు కోహ్లీ-రోహిత్‌ను ఎంపిక చేయడంతో ఇక వీళ్లిద్దరూ టీ20 ప్రపంచ కప్ ఆడతారనే విషయం స్పష్టమైంది. అయితే.. మరి టీ20ల్లో చాలా గ్యాప్ తర్వాత ఆడుతున్న వీరిద్దరిపై చాలా అంచనాలు ఉన్నాయి. ఎలా ఆడతాడో అనే అనుమానం కూడా ఉంది. దీంతో వీళ్ల పాత టీ20 రికార్డ్స్‌ను ఒక సారి పరిశీలిస్తే.. ఆఫ్ఘాన్‌కు దిమ్మతిరిగడం ఖాయంగా కనిపిస్తోంది.
మొదటగా విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 107 టీ20 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 52.73 సగటు, 137.96 స్ట్రైక్‌రేట్‌తో 4008 పరుగులు చేశాడు. 122 అత్యధిక స్కోర్. టీ20ల్లో కోహ్లీకి ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 356 ఫోర్లు, 117 సిక్సులు బాదాడు. ఇక రోహిత్ శర్మ స్టాట్స్ తీసుకుంటే.. రోహిత్ ఇప్పటి వరకు 140 టీ20 ఇన్నింగ్సుల్లో 31.32 సగటు, 139.24 యావరేజ్‌తో 3853 పరుగులు చేశాడు. 118 అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇప్పటి వరకు టీ20ల్లో 4 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు చేశాడు. 348 ఫోర్లు, 182 సిక్సులు బాదాడు. మరి ఈ స్టాట్స్ చూస్తుంటే.. వీళ్లిద్దరూ నిఖార్సయిన టీ20 బ్యాటర్లుగానే కనిపిస్తున్నారు. మరి ఇదే టెంపోను కొనసాగిస్తే.. టీ20 వరల్డ్ కప్‌లోనూ రో-కో జోడి దుమ్మురేపే అవకాశం ఉంది. మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 స్టాట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Two stalwarts of Indian cricket have made a comeback in the T20I squad. 🫡😍 pic.twitter.com/0xh2ps2aQ4
— CricketGully (@thecricketgully) January 8, 2024