రోహిత్ శర్మపై రితిక కోపం! హిట్ మ్యాన్ చేసింది తప్పే మరి!

టీమిండియా సక్సెస్‌ జర్నీ అద్భుతంగా కొనసాగుతోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందిస్తున్నాడు. అయితే.. రోహిత్‌ శర్మ భార్య రితిక మాత్రం ప్రస్తుతం రోహిత్‌పై కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆమె కోపానికి కారణం ఏంటో చూద్దాం..

టీమిండియా సక్సెస్‌ జర్నీ అద్భుతంగా కొనసాగుతోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందిస్తున్నాడు. అయితే.. రోహిత్‌ శర్మ భార్య రితిక మాత్రం ప్రస్తుతం రోహిత్‌పై కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆమె కోపానికి కారణం ఏంటో చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తోంది. ఇప్పటికే సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన రోహిత్‌ సేన.. ఈ టోర్నీలో బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్న సౌతాఫ్రికాను సైతం మట్టికరిపించింది. ఆదివారం కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. కేవలం 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సులతో 40 పరుగులు చేసి అదరగొట్టాడు. రోహిత్‌ ఇచ్చిన స్టార్‌ టీమిండియాకు ఎంతో హెల్ప్‌ చేసింది. ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా బౌలర్లపై ఆరంభంలోనే రోహిత్‌ విరుచుకుపడట​ంతో వారు ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లింది.

రోహిత్‌ శర్మ ఆడింది 40 పరుగుల ఇన్నింగ్సే అయినా.. అది ఎంతో ఇంప్యాక్ట్‌ చూపించింది. మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేసినా కూడా.. రోహిత్‌ అందించిన స్టార్ట్‌పై భారీగా ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ, రోహిత్‌ సతీమణి రితికా మాత్రం తన భర్తపై కోపంగా ఉన్నట్లు సమాచారం. రోహిత్‌ శర్మ ఎంత భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడో మనందరికీ తెలిసిందే. వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ చేసిన బ్యాటర్‌ రోహిత్‌ శర్మనే. అలాంటి ఆటగాడు ప్రస్తుతం వేగంగా ఆడాలనే క్రమంలో తక్కువ స్కోర్లకు, 80ల్లో అవుటైపోతున్నాడు. కొన్నిసార్లు బాగా ఆడుతున్న క్రమంలో భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్‌ ఇచ్చేస్తున్నాడు. ఇదే రితిక కోపానికి కారణంగా అవుతోంది.

అనవసరంగా వేగంగా ఆడి వికెట్‌ పారేసుకుంటున్నాడని, కొన్ని సార్లు కాస్త నిదానంగా ఆడితే ఏమైవుతుందని రితిక భావిస్తోంది. ఆదివారం రోహిత్‌ శర్మ అవుటైన తర్వాత రితిక ఫేస్‌ చూస్తే అది చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. గతంలో రోహత్‌ శర్మ అవుటైతే.. రితిక ముఖంలో బాధ కనిపించేది. కానీ, ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రోహిత్‌ అవుటైన తర్వాత ఆమె కళ్లలో కోపం కనిపించింది. అయితే.. రోహిత్‌ శర్మ ఇలా ఆడేది జట్టు కోసమే. ఓపెనర్‌ తానొచ్చి పవర్‌ ప్లేలో వేగంగా పరుగులు చేస్తే.. ప్రత్యర్థి బౌలర్లు డీలా పడిపోవడమే కాకుండా.. తన తర్వాతి వచ్చే బ్యాటర్లకు మంచి ప్లాట్‌ ఫామ్‌ దొరుకుతుంది. టీమ్‌ కోసం మాత్రమే రోహిత్‌ అలా అడుతున్నాడు. మరి రోహిత్‌ బ్యాటింగ్‌ స్టైల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments