Nidhan
Shubman Gill, Rishabh Pant, Duleep Trophy 2024, IND B vs IND A: గ్రౌండ్లో బయట ఒకేలా ఉండే అరుదైన క్రికెటర్లలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఒకడు. అందరితో కలసిపోయి నవ్వుతూ, నవ్విస్తూ ఉండే పంత్ చేసిన ఒక తుంటరి పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
Shubman Gill, Rishabh Pant, Duleep Trophy 2024, IND B vs IND A: గ్రౌండ్లో బయట ఒకేలా ఉండే అరుదైన క్రికెటర్లలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఒకడు. అందరితో కలసిపోయి నవ్వుతూ, నవ్విస్తూ ఉండే పంత్ చేసిన ఒక తుంటరి పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
Nidhan
గ్రౌండ్లో బయట ఒకేలా ఉండే అరుదైన క్రికెటర్లలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఒకడు. అందరితో కలసిపోయి నవ్వుతూ, నవ్విస్తూ ఉండే పంత్ చేసిన ఒక తుంటరి పని ఇప్పుడు వైరల్ అవుతోంది. దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా ఇండియా బీ తరఫున బరిలోకి దిగిన పంత్.. అపోజిషన్ టీమ్ క్యాంప్‌లోకి తెలివిగా చొరబడ్డాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు తెలియకుండా ఆ టీమ్ ప్లానింగ్‌ను పట్టేశాడు. చడీ చప్పుడు కాకుండా ప్రత్యర్థి జట్టు శిబిరంలోకి వెళ్లి వాళ్ల సీక్రెట్స్ అన్నీ తెలుసుకున్నాడు పంత్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగింది? గిల్‌ను పంత్ ఎలా బురిడీ కొట్టించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇండియా బీతో జరిగిన మ్యాచ్‌లో బ్రేక్ టైమ్ తర్వాత ఇండియా ఏ టీమ్ గ్రౌండ్లోకి దిగింది. ఈ టైమ్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ ఆవేశ్ ఖాన్ సహా జట్టు సభ్యులంతా ఒక చోట గుమిగూడారు. ఈ సమయంలో వాళ్లకు గిల్ ఏదో సీరియస్‌గా చెబుతూ కనిపించాడు. ప్రత్యర్థి జట్టును ఎలా ఆపడం, బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించడం, బౌలింగ్ ఛేంజెస్, ఫీల్డింగ్ పొజిషన్స్ మీద డిస్కస్ చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఎవరికీ తెలియకుండా ఆ గుంపులోకి దూరాడు పంత్. ప్రత్యర్థి ఆటగాళ్లపై చేతులు వేసి వాళ్లలో ఒకడిలా కలసిపోయాడు. గిల్ మాట్లాడటం అయిపోయాక అందరు ఆటగాళ్లు గ్రౌండ్లోకి వెళ్లగా.. పంత్ మాత్రం బౌండరీ రోప్ దాటి తన టీమ్ క్యాంప్‌లో చేరిపోయాడు. ఈ టైమ్‌లో అక్కడే ఉన్న ఇండియా బీ పేసర్ ఆవేశ్ ఖాన్ ఇది చూసి నవ్వుల్లో మునిగిపోయాడు.
పంత్ తమ బ్యాటర్ల కోసం గిల్ వేస్తున్న వ్యూహాలన్నీ తెలుసుకున్నాననే సంతోషమో ఏమో అతడు ఒకింత గర్వంతో తన టీమ్ క్యాంప్‌కు తిరిగొచ్చాడు. బయటకు వచ్చేటప్పుడు ఆవేశ్ ఖాన్‌కు విష్ చేసి మరీ వచ్చాడు పంత్. ఆ టైమ్‌లో అటు ఆవేశ్, ఇటు రిషబ్ ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోవడాన్ని వీడియోలో చూడొచ్చు. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్స్ పంత్ మామూలోడు కాదు.. సైలెంట్‌గా వెళ్లి ప్రత్యర్థుల గుట్టంతా పట్టేశాడని అంటున్నారు. గిల్ సహా ఎవరూ అతడ్ని గుర్తించలేకపోయారని, బహుశా భారత్ తరఫున కలసి ఆడతారు కాబట్టి అదే ఆలోచనతో లైట్ తీసుకున్నాడేమోనని చెబుతున్నారు. అయితే పంత్‌తో పాటు గిల్ టీమ్ కూడా సరదాగా ఇలా చేశారా? లేదా రిషబ్ నిజంగానే అపోజిషన్ టీమ్ సీక్రెట్ తెలుసుకునేందుకు ఇలా ప్రయత్నించాడా? అనేది క్లారిటీ లేదు. కానీ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. మరి.. గిల్‌ను పంత్ బురిడీ కొట్టించడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
India B player Rishabh Pant joined India A huddle in the morning to understand the opponent’s plan. 🤣👏 pic.twitter.com/QZHkIpRdFL
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2024