SNP
Ravichandran Ashwin, TNPL 2024, ITT vs DGD: టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దుమ్మురేపతున్నాడు. తాజాగా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అది కూడా ఓపెనర్‌గా.. ఆ మాస్ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు చూద్దాం..
Ravichandran Ashwin, TNPL 2024, ITT vs DGD: టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దుమ్మురేపతున్నాడు. తాజాగా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అది కూడా ఓపెనర్‌గా.. ఆ మాస్ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఇకపై కేవలం స్పిన్నర్ అంటే మాత్రం అతనే కాదు.. క్రికెట్ అభిమానులు కూడా ఒప్పుకోరు. గతంలో కూడా బ్యాట్‌తో సత్తా చాటినా.. ఇప్పుడు ఏకంగా విధ్వంసం సృష్టిస్తున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024లో మొత్తం అశ్విన్ హవా నడుస్తోంది. బౌలింగ్‌లో ఓకే అనిపిస్తున్న అశ్విన్.. బ్యాటింగ్‌లో మాత్రం శివాలెత్తుతున్నాడు. టీఎన్‌పీఎల్ 2024లో భాగంగా ఇటీవలె చెపాక్ సూపర్ గిల్లీస్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన.. 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేసి అదరగొట్టాడు. తన టీమ్ దిండిగల్ డ్రాగన్స్‌ను క్వాలిఫైయర్-2కు తీసుకెళ్లాడు. ఇప్పుడు అంతకంటే బెటర్ ఇన్నింగ్స్‌తో తన టీమ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
శుక్రవారం ఐడ్రీమ్ తిరూప్పూర్ తమిజన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విమల్ ఖుమార్‌తో కలిసి దిండిగల్ డ్రాగన్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభించి.. దుమ్ములేపాడు. ఫోర్లు సిక్సులతో చెలరేగి.. తన టీమ్‌ను ఒంటిచేత్తో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. కేవలం 30 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సులతో 69 పరుగులు చేసి అదరగొట్టాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 27 రన్స్ ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టిన అశ్విన్.. బ్యాటింగ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. పైగా రివర్స్ స్వీప్ షాట్లతో రెచ్చిపోయాడు. భారీ భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తాను కూడా ఓ బౌలర్ అనే విషయాన్ని మర్చిపోయి.. ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్ 19.4 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. మాన్ బఫ్నా ఒక్కడే 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే అవుట్ అయ్యారు. దిండిగల్ డ్రాగన్స్ బౌలర్లలో పీ.విగ్నేష్ 3 వికెట్లతో సత్తాచాటాడు. సుబోత్ భాటి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీసుకున్నాడు. ఇక 109 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన దిండిగల్ డ్రాగన్స్ 10.5 ఓవర్లోనే 112 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ విమల్ ఖుమార్ 28, కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ 69(నాటౌట్), బాబా ఇంద్రజిత్ 8(నాటౌట్) మ్యాచ్ గెలిపించారు. ఈ విజయంతో దిండిగల్ డ్రాగన్స్ టీఎన్‌పీఎల్ 2024 ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆగస్టు 4న లైకా కోవాయ్ కింగ్స్‌తో టైటిల్ కోసం పోటీ పడనుంది. మరి ఈ మ్యాచ్‌లో అశ్విన్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The ball striking of Ravi Ashwin. 🤯
– Ashwin showing Gautam Gambhir his abilities. 😆pic.twitter.com/LNMnSt4hHW
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2024