డబ్బుల కోసం రోహిత్​ ఆ పని చేయడు.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Rohit Sharma, Ravichandran Ashwin, Mumbai Indians: ఏ విషయం మీదైనా సూటిగా, స్పష్టంగా తన అభిప్రాయాలు చెబుతుంటాడు ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. అలాంటోడు తాజాగా రోహిత్ శర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిట్​మ్యాన్ డబ్బుల కోసం ఆ పని చేసే రకం కాదన్నాడు.

Rohit Sharma, Ravichandran Ashwin, Mumbai Indians: ఏ విషయం మీదైనా సూటిగా, స్పష్టంగా తన అభిప్రాయాలు చెబుతుంటాడు ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. అలాంటోడు తాజాగా రోహిత్ శర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిట్​మ్యాన్ డబ్బుల కోసం ఆ పని చేసే రకం కాదన్నాడు.

ఏ విషయం మీదైనా సూటిగా, స్పష్టంగా తన అభిప్రాయాలు చెబుతుంటాడు భారత ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. దేనికీ భయపడకుండా తాను ఏం అనుకుంటున్నాడో బయటకు చెప్పేస్తాడు. అందుకే అతడి బౌలింగ్, బ్యాటింగ్​తో పాటు వ్యక్తిత్వానికి కూడా చాలా మంది ఫిదా అయిపోయారు. అలాంటి అశ్విన్ తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిట్​మ్యాన్ డబ్బుల కోసం ఆ పని చేసే రకం కాదన్నాడు. అతడి గురించి తనకు బాగా తెలుసునని అన్నాడు. ఒక స్టేజ్​కు వచ్చాక డబ్బులు పెద్ద మ్యాటర్ కాదని.. రోహిత్​ కూడా ఇలాగే ఆలోచిస్తాడని చెప్పాడు. ఏ విషయంలో హిట్​మ్యాన్​ గురించి అశ్విన్ ఇలా అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్​ను తీసేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2024కు ముందు హిట్​మ్యాన్​ను తీసేసి గుజరాత్​ టైటాన్స్​లో ఉన్న హార్దిక్​ను తీసుకొచ్చి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. ఈ వివాదంతో రోహిత్ ఆ సీజన్​లో ఆడడనే రూమర్స్ వచ్చాయి. అయినా అతడు ఆడాడు. అయితే ఐపీఎల్-2025కు ముందు మెగా ఆక్షన్ ఉండటంతో అతడు ఎంఐ నుంచి బయటకు రావడం ఖాయమని అంటున్నారు. వేలంలోకి వస్తే రోహిత్​కు రికార్డు ధర పక్కా అని.. ఈజీగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పలుకుతాడని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. తాజాగా ఈ విషయంపై అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. ముంబైని వదిలి రోహిత్ ఎక్కడికీ వెళ్లడని అనుకుంటున్నానని చెప్పాడు. హిట్​మ్యాన్ లాంటి వాళ్లు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వరన్నాడు. ఒకస్థాయికి చేరిన తర్వాత కొందరికి డబ్బు పెద్ద మ్యాటర్ కాదని.. దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరని యూట్యూబ్ చానెల్​లో మాట్లాడుతూ కామెంట్స్ చేశాడు అశ్విన్.

రోహిత్​లా ఆలోచించడంలో ఏమాత్రం తప్పు లేదు. కొత్త తలనొప్పులు కావాలని ఎవరూ కోరుకోరు. అతడు టీమిండియాకు కెప్టెన్​గా ఉన్నాడు. ముంబై ఇండియన్స్​కు చాన్నాళ్లు సారథ్యం వహించాడు. కాబట్టి కెప్టెన్సీ లేకపోయినా ముంబైకి ఆడటంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ముంబైకి ఆడితే బాగుంటుందని అనిపించడంలో తప్పు లేదు. రోహిత్ అనే కాదు.. చాలా మంది ఆటగాళ్లు అలాగే ఉంటారు. ఒక స్టేజ్ దాటాక డబ్బుకు ఎవరూ అంత ప్రాధాన్యం ఇవ్వరు’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. రోహిత్​ ముంబై నుంచి వెళ్లడు అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డబ్బుల కోసం కాదు గానీ 5 ట్రోఫీలు అందించినా అవమానకర రీతిలో కెప్టెన్సీ నుంచి తీసేశారు.. కాబట్టి ఆత్మాభిమానం కోసం ఎంఐని హిట్​మ్యాన్ విడిచి వెళ్లే ఛాన్సులు ఉన్నాయని కొందరు నెటిజన్స్ అంటున్నారు. మరికొందరు మాత్రం తాను నిర్మించిన సామ్రాజ్యాన్ని వదలడని.. చివరి వరకు అందులోనే ఉంటాడని చెబుతున్నారు. మరి.. రోహిత్ ముంబైని వదిలి వెళ్తాడా? లేదా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments